
సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై నిజామాబాద్‌ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సోమవారం(సెప్టెంబర్30)ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టిన రైతు దీక్షలో అరవింద్ మాట్లాడారు.
‘రేవంత్‌రెడ్డి.. విదేశీ పర్యటనలు అవసరం లేదు. గజ్వేల్‌లో కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఎకరాకు కోటి రూపాయలు సంపాదించారట. ఇది అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రైతులను పంపించాలని రేవంత్‌కు సలహా ఇస్తున్నా.
కేసీఆర్ ఉద్యమం నడిపినన్ని రోజులు పులి.కేసీఆర్ స్పీచ్ మిస్ అవుతున్నాం. పిల్లల మాటలు విని కేసీఆర్ పిల్లి అయ్యారు. కేసీఆర్ ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్. జాతిపిత కావాల్సిన కేసీఆర్ పిల్లల అవినీతికి పితగా మారారు’అని అరవింద్ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: ఢిల్లీ నుంచి వచ్చి క్షమాపణలు చెప్తారా..?: కేటీఆర్