
సాక్షి, రాజమండ్రి: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ ఎలా మాట్లాడారో.. ఆయన హావభావాలను ప్రజలు గమనించారు. చిన్నబాబును, పెద్దబాబును బీజేపీలో కలపడమే పవన్ ఎజెండాయ అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు.
కాగా, ఎంపీ భరత్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిని పవన్ కల్యాణ్ ఏం అడిగారు. విజభన హామీలు అడిగారా.. హోదా గురించి అడిగారా?. స్టీల్‌ప్లాంట్, పోలవరం గురించి మాట్లాడారా?. రాష్ట్రానికి సంబంధించి ఏం అడిగారో ప్రజలకు చెప్పాలి. చిన్నబాబు, పెద్దబాబు భవిష్యత్తే పవన్ అజెండానా?. పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్ కోసం పవన్ అడిగారా?. ప్రధాని మోదీ పర్యటనకు వచ్చినప్పుడే లోకేష్ పాదయాత్ర గురించి పేపర్లలో రాయించారు. ప్రధాని పేపర్లు చూస్తారనే ఇలా క్రియేట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.