సాక్షి, అమరావతి: మత విశ్వాసాలను అడ్డుపెట్టుకుని విద్వేషాలు రెచ్చగొడుతున్న పవన్ కల్యాణ్ దశావతారాలు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూటకో మాట మార్చే పవన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో!. బాధ్యత గల డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్.. తప్పు జరిగితే సరిదిద్దాలి కానీ.. రాజకీయాల్లోకి మతాన్ని లాగడం ద్వారా నీచ రాజకీయాలకు తెరతీశారు. ఎన్నికల ముందు కులాలను రెచ్చగొట్టిన పవన్.. క్రిస్టియన్లు, ముస్లింలకు ఉన్న ఐక్యత మీకు లేదా అంటూ ‘లడ్డూ’ రాజకీయాలతో ఇప్పుడు హిందువులను రెచ్చగొట్టే పనిలో పడ్డారు.
‘‘నా కూతురు క్రిస్టియన్
బీఫ్ తింటే తప్పేముంది
మానాన్న దీపరాధనతో సిగరెట్ వెలిగిచుకొనేడాడు
కులమతాల గొడవలు పెట్టేది హిందువులే
మేరిమాత గొప్ప దేవత
ముస్లిమ్ మీద ఇష్టంతోనే వాళ్లు వస్త్రాధారణ వేసుకున్నాడంట’’
అంటూ వేర్వేరు సందర్భాల్లో పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అప్పుడిలా.. ఇప్పుడిలా.. ధర్మంపై ఇన్ని కప్పగెంతులా? అంటూ పవన్ కపటత్వాన్ని నెటిజన్లు ఎండగడుతున్నారు. ఈ క్రమంలో నటుడు ప్రకాశ్‌రాజ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘‘గెలిచే ముందు ఒక అవతారం. గెలిచాక ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: రాజకీయాల్లోకి మతాన్ని లాగడమా?
Comments
Please login to add a commentAdd a comment