సాక్షి, అమరావతి: అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ అని, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014-19లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ చేసిన దౌర్జన్యాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ‘‘అనంతపురంలో రాళ్లు వేశారు. ఓ విద్యార్థికి దెబ్బలు తగిలాయి. మా ప్రభుత్వంలో ఎవరైనా సరే దాష్టీకం చేస్తే సహించేది లేదు. అక్కడ కొన్ని శక్తులు దూరినట్లు ఉన్నాయన్నారు.
చదవండి: ‘బీజేపీ నేతలు పేదల రక్తం పీలుస్తున్నారు’
2249 ఎయిడెడ్ సంస్థలు ఉంటే.. 702 సంస్థలు వాళ్లే నడుపుకుంటున్నారు. ఇక్కడ ఏమీ బలవంతం లేదనడానికి ఇదే నిదర్శనం. 101 సంస్థలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. వారిలో మళ్లీ వెనక్కు అడుగుతున్నారు. టీచర్లు, యాజమాన్యం కలిసి వచ్చిన చోట మాత్రమే తీసుకున్నాం. అసలు ఇందులో విమర్శలు చేయడానికి అవకాశం ఎక్కడుంది. అసలు ఈ విధానం వల్ల నష్టం ఏమిటి..? ఆందోళన చేయడంలో రాజకీయ పార్టీలకు వచ్చే ప్రయోజనం ఏమిటి..? ఎయిడెడ్ విషయంలో ఎలాంటి బలవంతం చేయడం లేదు. టీచర్లు చాలా ఆనందంగా ఉన్నారు. అబద్ధపు విష ప్రచారాన్ని నమ్మొద్దు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు సామాజిక న్యాయంతో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ప్రభుత్వ ప్రకటనలో అవాస్తవం ఏముంది?
ప్రభుత్వ ప్రకటనలో అవాస్తవం ఏముందో బీజేపీ నేతలు చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రూ.3.20 లక్షల కోట్లు కేంద్రం కోటా కింద వేసుకుంటున్నారు. దాన్ని కూడా రాష్ట్రాలకు వాటా ప్రకారం ఇవ్వాలన్నారు. అప్పుడు కేంద్రం ఎంత తగ్గిస్తే.. దాని ప్రకారం రాష్ట్రాల్లో తగ్గుతుందని సజ్జల పేర్కొన్నారు.
చదవండి: అల్లుడు.. గిల్లుడు.. ఎన్ని కోట్లు
Comments
Please login to add a commentAdd a comment