రూ.7,200 కోట్లు తీసుకొని భ్రమరావతిగా మార్చిన చంద్రబాబు | Somu Veerraju Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రూ.7,200 కోట్లు తీసుకొని భ్రమరావతిగా మార్చిన చంద్రబాబు

Published Tue, Nov 24 2020 4:09 AM | Last Updated on Tue, Nov 24 2020 9:42 AM

Somu Veerraju Fires On Chandrababu Naidu - Sakshi

సూళ్లూరుపేట: చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.7,200 కోట్లు తీసుకుని భ్రమరావతిగా మార్చాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. సోమవారం ఆయన తడ శ్రీసిటీకి చేరుకుని అక్కడ నుంచి సూళ్లూరుపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. శేషసాయి కల్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తలతో శిక్షణ సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.7,200 కోట్లు చంద్రబాబు ఏమి చేశారో తెలియదని, రోజుకో గ్రాఫిక్స్‌ షో చూపించి ఆ నిధులన్నింటిని తన అనుచరులకు అధికారికంగానే దోచి పెట్టారని ఆరోపించారు. ఆయనతో పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదగలేకపోయిందన్నారు. ఈసారి తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికలో జనసేన పార్టీని కలుపుకుని బరిలోకి దిగనున్నామని స్పష్టం చేశారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో కేంద్రం చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడుగుతామని సోము వీర్రాజు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement