డెరిక్ ఒబ్రెయిన్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతున్న సుస్మితా దేవ్(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: తాను పదవులు ఆశించడం లేదని, అధిష్టానం ఆదేశాలను శిరసా వహించడమే తన కర్తవ్యమని మాజీ ఎంపీ సుస్మితా దేవ్ అన్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తానేమీ ఆశించలేదని, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోనూ అదే విధంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడిన సుస్మితా దేవ్ సోమవారం తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకున్నారు.
ఈ క్రమంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన సుస్మితా దేవ్.. ‘‘టీఎంసీలో చేరడం ద్వారా నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మనసు చంపుకొన్నట్లు కాదు. ఎప్పుడూ నేను పదవులు ఆశించలేదు. మమతా బెనర్జీ ఏ బాధ్యతను అప్పగించినా దానిని సక్రమంగా నెరవేర్చడమే నా ముందున్న పని’’ అని పేర్కొన్నారు. కాగా అసోంకు చెందిన సుస్మితా దేవ్ గతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేశారు. అయితే, ఆ పార్టీని వీడటానికి గల ప్రధాన కారణాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.
చదవండి: Afghanistan: ‘వాళ్ల కోసమే వెయిటింగ్.. వచ్చి నన్ను చంపేస్తారు’
Comments
Please login to add a commentAdd a comment