Nov 5th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Naidu Cases Petitions Nov 05 Updates | Sakshi
Sakshi News home page

Nov 5th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sun, Nov 5 2023 7:35 AM | Last Updated on Sun, Nov 5 2023 7:05 PM

TDP Chandrababu Naidu Cases Petitions Nov 05 Updates - Sakshi

Chandrababu Naidu Cases Today Updates

05:40 PM, నవంబర్‌ 05, 2023
లోకేష్ ట్వీట్‌కు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కౌంటర్
►చంద్రబాబు హయాంలో ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో ఏం చేశారో చెప్పాలి
►ఆరోగ్యశ్రీ ప్రొసీజర్‌లు పెంచాలని గానీ, హాస్పిటల్ కట్టాలని గానీ ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురావాలని ఒక డాక్టర్ నియమించాలని గానీ కనీస అలోచన చంద్రబాబు హయాంలో చేయలేదు
►ఫ్యామిలీ డాక్టర్. జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి ఆలోచనలు ఎప్పుడైనా చేశారా ?
►ఈ  రాష్ట్రంలో  చంద్రబాబు హయాంలో  పేదల వైద్యం కోసం ఏం చేశారో చెప్పాలి
►నాడు- నేడు ద్వారా 16 వేల కోట్లతో ఇప్పుడు ఏపిలో ఆసుపత్రుల ఆధునికన్నా నిర్మాణం చేపడితే లోకేష్‌కు కనిపించదా?

12:00 PM, నవంబర్‌ 05, 2023
పవన్‌పై మంత్రి అంబటి ఫైర్‌
►కిషన్‌రెడ్డితో పవన్‌ భేటీ
►విలువలు లేని తమకే ఇది సాధ్యమంటూ ఫైర్‌
►తెలంగాణ, ఏపీలో పవన్ వ్యవహాశైలిని తప్పు పట్టిన అంబటి
►తెలంగాణలో బీజేపీతో, ఏపీలో టీడీపీతో పొత్తుపై సెటైర్లు

11:30 AM, నవంబర్‌ 05, 2023
పురంధేశ్వరికి వెల్లంపల్లి కౌంటర్‌
►టీడీపీ కోవర్టుగా, తొత్తుగా పురంధేశ్వరి 
►కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, హామీల గురించి మాట్లాడని పురంధేశ్వరి
►వైఎస్సార్‌సీపీని విమర్శంచడమే ఆమె పని
►బీజేపీతో చంద్రబాబును కలపడమే పురంధేశ్వరి లక్ష్యం. 

 8:15 AM, నవంబర్‌ 05, 2023
శకుని పాత్ర పోషించిన మహిళ పురంధేశ్వరి: విజయసాయి కౌంటర్‌
►ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి.
►బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార  గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం.
►తండ్రిని అవమానించిన పార్టీలో పదవులు అనుభవించిన గొప్ప కూతురు ఆమె.
►నాడు చంద్రబాబు పార్టీ నుంచి గెంటేసినా.. నేడు మాత్రం బాబు కోసం తపన
►ఏపీని విభజనలో తన వంతు శకుని పాత్ర పోషించిన మహిళ పురంధేశ్వరి
►రాష్ట్రాన్ని నాశనం చేసిన గొప్ప మహిళ పురంధేశ్వరి. 

7:40 AM, నవంబర్‌ 05, 2023
మళ్లీ టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశం
►ఈ నెల 9న టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశం
►ఉమ్మడి కార్యాచరణ దిశగా ఏకాభిప్రాయ సాధనకు టీడీపీ-జనసేన నిర్ణయం
►ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లేందుకు కరపత్రం తీసుకురావాలని రెండు పార్టీలు నిర్ణయం
►ఉమ్మడి ఎజెండాతో కార్యక్రమాలు చేపట్టేలా అడుగులు
►ఉమ్మడిగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని టీడీపీ-జనసేన నిర్ణయం

7:25 AM,  నవంబర్‌ 05, 2023
బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు?
►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు
►1997లో రెడ్యానాయక్‌ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే 
►1998లో వైఎస్సార్‌ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే
►1999లో షబ్బీర్‌ అలీ, 1999లో డీఎల్‌ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. 
►1999, 2000, 2001 వైఎస్సార్‌ గారు తిరిగి దావా వేస్తే స్టే. 
►2003లో కృష్ణకుమార్‌ గౌడ్‌ కేసు వేస్తే స్టే 
►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్‌ పెట్టాడని దావా వేస్తే స్టే
►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే.
►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు 
►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే
►2005లో బాబు అక్రమాస్తులపై  లక్ష్మీపార్వతి హైకోర్టులో  కేసు వేస్తే స్టే 
►2005 శ్రీహరి, అశోక్‌ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే
►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే
►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP

7:20 AM,  నవంబర్‌ 05, 2023
పవన్‌తో కిషన్‌రెడ్డి భేటీ..
►హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నివాసానికి కిషన్ రెడ్డి
►జనసేన సీట్ల సర్ధుబాటుపై చర్చలు
►ఎన్నికల్లో 11 సీట్లకు సంబంధించిన జాబితా సిద్దం చేసిన జనసేన
►శేరిలింగంపల్లి వదులుకోవాలని కోరిన కిషన్ రెడ్డి
►శేరిలింగంపల్లి బదులుగా నాంపల్లి అసెంబ్లీ సీటు ఇవ్వాలని బీజేపీ యోచన

7:15 AM, నవంబర్‌ 05, 2023
పురంధేశ్వరికి కౌంటర్‌!
►జనసేనతోనే పొత్తు అంటున్న పురంధేశ్వరి
►టీడీపీతో మాత్రమే మా పొత్తు అంటున్న జనసేన 
►స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు
►రేవంత్‌ను గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు
►వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప పార్టీలు, ప్రజలు వారికి అనవసరం.

యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ యాత్ర ఎటు పోయింది?
►చంద్రబాబు విడుదల తర్వాత మారిన టీడీపీ తీరు
►చంద్రబాబు భార్య భువనేశ్వరి ఇక నిజం యాత్రకు ఫుల్‌స్టాప్‌ పెడతారని పార్టీలో టాక్‌
►చంద్రబాబు ఇంటికొచ్చారు, నేను రాలేనని చెబుతున్నట్టు సమాచారం
►ఇప్పటికే లోకేష్‌ పేరుతో ఎన్నో యాత్రల ప్రచారం
►ముందు యువగళం, తర్వాత మేలుకో తెలుగోడా, ఆ తర్వాత మరొకటి
► ఢిల్లీకి వెళ్లడం, తిరిగి రావడం తప్ప ప్రజల్లోకి వెళ్లేందుకు ససేమిరా
►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్
►ముందు తన నియోజకవర్గం ఫైనల్‌ చేసుకుంటానంటున్న లోకేష్‌

లోకేష్ కు సేఫ్ సీటు ఎక్కడ? మామకు వెన్నుపోటు తప్పదా?
► మంగళగిరివైపు చినబాబు సందేహంగా చూపులు
► తనకు సేఫ్ సీటు కావాలంటూ ముందే కమిటీకి తేల్చిచెప్పిన చినబాబు
► మంగళగిరిలో మళ్లీ ఓడితే తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందన్న ఆందోళన
► లోకేష్ ముందు నాలుగు ప్రతిపాదనలు పెట్టిన టిడిపి సీనియర్లు
► ఎక్కడయితే గెలవగలవో తేల్చుకోవాలని సూచించిన టిడిపి సీనియర్లు.

జనసేనలో ఏం జరుగుతోంది?
► పవన్‌ కళ్యాణ్‌ చర్యలతో విసుగు చెందుతోన్న జనసేన నాయకులు
► నెల్లూరు జనసేన ఇన్‌ఛార్జ్‌ కేతంరెడ్డి వినోద్‌ ఎందుకు దూరంగా ఉంటున్నారు?
► పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్‌ మాకినేని శేషుకుమారి ముఖమెందుకు చాటేశారు?
► తిరుపతి జనసేన నాయకులు పసుపులేటి సురేష్‌, దిలీప్‌ సుంకర ఎందుకు దూరమయ్యారు?
► రాయలసీమ ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్‌ పసుపులేటి పద్మావతి  ఎందుకు పార్టీవైపు చూడడం లేదు?
► జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్‌ వెనక ఏం జరుగుతోంది?
► ఇప్పుడు జనసేనలో అధికారం ఎవరి చేతిలో ఉంది?
► జనసేన ప్రధాన కార్యాలయంలో రుక్మిణికి పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన బాధ్యతలేంటీ?

భువనేశ్వరీ నిజం నిలిచిపోయిందా?
► రూ.3లక్షల చొప్పున ఇస్తామంటూ ఘనంగా తెలుగుదేశం ప్రకటనలు
► చంద్రబాబు కోసం చనిపోయారు కాబట్టి రూ.3లక్షలు ఇస్తామన్న భువనేశ్వరీ
► అలా ఓ నలుగురికి పంచేసరికి మారిపోయిన సీను
► చంద్రబాబు విడుదల కాగానే నిలిచిపోయిన నిజం యాత్ర
► మిగతా వాళ్లకెపుడు ఇచ్చేది మూడు లక్షల చెక్కులు?
► పాత డేట్లతో ముందే చెక్కులు ఎలా తయారు చేశారు?
► మీ నిజం యాత్రకు నిజంగానే బ్రేకులేశారా?

07:10 AM, నవంబర్‌ 05 2023
అదనపు షరతులు వర్తిస్తాయి
►ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి మరో ఎదురు దెబ్బ
►మధ్యంతర బెయిల్‌ అదనపు షరతులు కోరుతూ సీఐడీ అదనపు పిటిషన్‌
►అదనపు షరతులు అక్కర్లేదంటూ చంద్రబాబు పిటిషన్‌
►చంద్రబాబు లాయర్ల వాదనతో ఏకీభవించని ఏపీ హైకోర్టు
►చంద్రబాబు బహిరంగ ర్యాలీలు నిర్వహించడం, పాల్గొనడం చేయరాదు
►బహిరంగ సభల్లో కూడా పాల్గొనరాదు 
►కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయకూడదు 
►మేం ఇచ్చింది కేవలం మెడికల్‌ బెయిల్‌ మాత్రమే
►కస్టోడియల్‌ బెయిల్‌తో సమానంగా పరిగణించడానికి వీల్లేదు 
►అదనపు షరతులు అవసరం లేదన్న బాబు వాదనను తిరస్కరించిన హైకోర్టు 

07:00 AM, నవంబర్‌ 05 2023
మావనతా దృక్ఫథంతోనే బాబుకి బెయిల్‌
►స్కిల్‌ స్కామ్‌లో మధ్యంతర బెయిల్‌ మీద చంద్రబాబు
►ఆరోగ్య కారణాల రీత్యా నాలుగువారాల బెయిల్‌ ఇచ్చిన కోర్టు
►తిరిగి నవంబర్‌ 28 సాయంత్రం 5గం.లోపు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో లొంగిపోవాలని ఆదేశం
►షరతులతో కూడిన బెయిల్‌.. ఉల్లంఘిస్తే వెంటనే రద్దు
►కంటికి సర్జరీ, ఇతర ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు
►వైద్య నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement