Breadcrumb
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Published Wed, Nov 8 2023 7:22 AM | Last Updated on Wed, Nov 8 2023 11:07 AM
Live Updates
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
సంగారెడ్డి యువ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ కామెంట్స్
- 90 స్థానాల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయం
- తెలంగాణ సింహం కేసీఆర్
- మనకు కరెంట్ కావాల్నా..కాంగ్రెస్ కావాల్నా
- కరెంట్ లేక కర్ణాటకలో పంటలు ఎండిపోతున్నయ్
- కాంగ్రెస్ ఒక్క చాన్స్ అడగడం హాస్యాస్పదం
- సంగారెడ్డికి మెట్రో రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి
సీతక్కకు షాక్
- ఎమ్మెల్యే సీతక్కకు షాక్ ఇచ్చిన ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు
- నామినేషన్ వేసిన రోజే కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరిన కొమరం ధనలక్ష్మి
బీఆర్ఎస్లోకి సిద్దిపేట బీజేపీ మహిళా నేత
- సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు అరుణ రెడ్డి
రేపు హరీశ్‌రావు నామినేషన్
- రేపు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్న మంత్రి హరీశ్ రావు
జాగో ఓటర్ బస్సు యాత్ర
- భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో జాగో తెలంగాణ ఓటరు చైతన్య బస్సు యాత్ర చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి
- మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి కుంగిన పియర్లను, వంతెనను పరిశీలించిన ఆకునూరి
రాజేంద్రనగర్ సభలో రేవంత్‌రెడ్డి కామెంట్స్
- కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుంది
- తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది
- దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం
- బీఆర్ఎస్ శంషాబాద్ మండలానికి చేసిందేమీ లేదు
- జాతీయస్థాయిలో శంషాబాద్‌కు పేరు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే
- శంషాబాద్ కు అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చింది కాంగ్రెస్సే
- ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జీవో 111 ఎత్తివేస్తామంటూ గెలుస్తున్నారు
- 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపిస్తే నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా
- లేదంటే అంబేద్కర్ విగ్రహం కాడ ముక్కు నేలకు రాస్తవా కేసీఆర్
సీఎం కేసీఆర్ పై చెరుకు రైతుల నామినేషన్
- గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పై ముగ్గురు చెరుకు రైతులు నామినేషన్ వేశారు
- మల్లాపూర్ మండలం ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ మూసివేతకు నిరసనగా చెరుకు ఉత్పత్తిదారుల సంఘ అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, డైరెక్టర్ లింబా రెడ్డి, రైతు నాయకులు బద్ధం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు
హుజురాబాద్‌లో ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలి శర్మ ప్రెస్‌మీట్
- కేసీఆర్ ఒక అబద్ధాల కోరు
- హుజురాబాద్‌లో బీఆర్ఎస్ ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు
- ఇంటింటికి లిక్కర్ స్కీమ్ అన్నట్లు కవిత లిక్కర్ వ్యాపారం చేస్తోంది
కాంగ్రెస్ అబ్జర్వర్ అపాయింట్మెంట్
- తెలంగాణ ఎన్నికల అబ్జర్వర్‌గా చెన్నితల రమేష్‌ను నియమించిన కాంగ్రెస్ హై కమాండ్
పార్టీలకు సీఈవో ప్రజెంటేషన్
- పొలిటికల్ పార్టీలకు పోలింగ్, కౌంటింగ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఈవో వికాస్ రాజ్
ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో హోం మంత్రి
- మక్తల్‌లో ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు
- మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మెన్ ఇంతియాజ్, ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు
సీఈవోతో భేటీ తర్వాత బీఆర్ఎస్ లీగల్ సెల్ చీఫ్ సోమా భరత్ కామెంట్స్
- అభ్యర్థుల బీ ఫామ్స్ చాలా మెకానికల్‌గా రిజెక్ట్ అవుతున్నాయి
- అఫిడవిట్లో తప్పులుంటే ఆర్వోలు అభ్యర్థులను అప్రమత్తం చేయాలి
- కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ సరిగ్గా లేదని నీతులు చెప్తోంది
- చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మొత్తం వ్యవస్థనే కాంగ్రెస్ తప్పు పడుతోంది
- రేవంత్ రెడ్డి మహిళల ముందే బూతులు మాట్లాడుతున్నారు.
- రేవంత్ రెడ్డి భాషపై ఈసీకి ఫిర్యాధు చేశాం
- మా ఫిర్యాధు మాత్రమే కాదు..ఈసీ రేవంత్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించాలి
- రేవంత్ రెడ్డికి భాష తెలియకపోతే తన భార్య, పిల్లల వద్ద నేర్చుకోవాలి
సీఈవోతో భేటీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కామెంట్స్
- పోలింగ్ ఏర్పాట్ల పై సీఈవో వికాస్ రాజ్ చర్చలు జరిపారు
- హెల్ప్ డెస్క్ పెట్టాలని సీఈవోను కోరాం
- అభ్యర్థులు సరిగ్గా నింపకుండ నామినేషన్ పత్రాలు ఇస్తే...తప్పులు సరిచేయకుండా RO స్వీకరించినట్లు తెలుస్తోంది
- అఫిడివిట్లో తప్పులు సరిచేయకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది
- సీఈవో ఆఫీస్ నుంచి ఉన్నతాధికారులు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు
- పొలిటికల్ పార్టీలకు సీఈవో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు
- అబ్జర్వర్ల వివరాలను వెబ్సైట్లలో పెట్టాలని కోరాం
- ఫైనల్ ఓటర్ లిస్ట్ ఈ నెల 10వ తేదీన పంపిణి చేస్తారని సీఈవో చెప్పారు
- ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి
- బీఎల్వోలు ఓటర్ స్లీప్ లు ఇంటింటికీ వెళ్లి పంపిణి చేస్తారనే నమ్మకం లేదు
- మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సీఈవోకు పంపాం
రేపు కేటీఆర్ నామినేషన్
- రేపు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నామినేషన్
సీఈవోతో ముగిసిన ఆల్‌పార్టీ భేటీ
- రాజకీయ పార్టీలతో ముగిసిన సీఈవో వికాస్ రాజ్ సమావేశం
గజ్వేల్‌లో మంత్రి హరీశ్‌రావు కామెంట్స్
- డీకేలు వచ్చినా, పీకేలు వచ్చినా మా ఏకే 47.. కేసీఆర్‌ను ఏం చేయలేరు
- రేపు నామినేషన్ వేసేందుకు సీఎం ఫాంహౌజ్ నుంచి హెలికాప్టర్లో గజ్వేల్ చేరుకుంటారు.
- అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారు.
- అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
- ఎన్నికల ప్రచారం ముగింపు సభ గజ్వేల్‌లో ఈనెల 28న కేసీఆర్ వస్తారు
నారాయణపేటలో బండి సంజయ్ కామెంట్స్
- కార్యకర్తలు కష్టపడి పని చేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ల బాక్స్‌లు బద్దలవ్వాలి
- బీఆర్ఎస్ గెలిస్తే ఇంట్లో గోడవలతో మళ్ళీ ఎన్నికలు
- కాంగ్రెస్ వస్తే సుస్థిర పాలన ఉండదు
- బాగా చదువుకున్న అంటాడు.. కేటీఆర్ అమెరికాలో చిప్పలు కడిగాడు
- చిప్పలు కడిగే వానికి నెలకు కోటి రూపాయలు
- నీ అయ్య పాస్‌పోర్ట్‌ల బ్రోకర్..కేసీఆర్ లేకుంటే నిన్ను ఎవరు దేక్తరు
బండ్ల గణేష్ కామెంట్స్
- కాంగ్రెస్ వేవ్ కనిపిస్తోంది
- కాంగ్రెస్సే పెద్ద స్టార్ , కాంగ్రెస్‌కు ఎలాంటి సినీ గ్లామర్ అవసరం లేదు
- బీఆర్ఎస్ కంటే అద్బుతంగా పాలన చేసి చూపెడుతాం
- బీఆర్ఎస్లో ఎంతమంది ప్రచారం చేసినా వారందరికి రేవంత్ రెడ్డి ఒక్కడు చాలు
11న హైదరాబాద్‌కు మోదీ
- హైదరాబాద్: ఈ నెల 11న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు
- మాదిగ విశ్వరూప సభలో పాల్గొననున్నారు
- ఎస్సీ వర్గీకరణ పై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది
సీతక్క నామినేషన్
- ములుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సీతక్క నామినేషన్
- వేలాది మంది కార్యకర్తలతో వెళ్లి అట్టహాసంగా కార్యక్రమం
- ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నాకు అధికార పార్టీ నేతలు ములుగు అభివృద్ధిలో ఇబ్బందులు కలిగించారు
- ఎన్ని ఇబ్బందులు కలిగించినా భారీ మెజార్టీతో గెలుస్తా
తుక్కుతుక్కుగా ఓడిస్తా..
- మహేశ్వరంలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్
- తుక్కుగూడలోనే ఉంటూ మంత్రి సబితను తుక్కుతుక్కుగా ఓడిస్తానని కామెంట్
మంత్రి మల్లారెడ్డి నామినేషన్
- కీసర ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేసిన మంత్రి మల్లారెడ్డి
రేపు కేసీఆర్ నామినేషన్
- గజ్వేల్, కామారెడ్డిలో రేపు కేసిఆర్ నామినేషన్
- రేపు సాయంత్రం కామారెడ్డి సభలో పాల్గొననున్న కేసిఆర్
- రేపటితో ముగియనున్న మొదటి విడత ప్రచారం
- ఈనెల 13 నుంచి కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం
నాగర్‌కర్నూల్ పోలీసులపై మల్లు రవి ఫిర్యాదు
- నాగర్ కర్నూల్ జిల్లా డీఎస్పీపై సీఈవో వికాస్ రాజ్‌కు ఫిర్యాధు చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి
- జిల్లా పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు
- కాంగ్రెస్ నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్న డీఎస్పీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు
జితేందర్‌రెడ్డి కొడుకు నామినేషన్
- మహబూబ్‌నగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డి నామినేషన్ వేశారు
- ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వీకే సింగ్, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు
- నామినేషన్‌కు ముందు ఎల్లమ్మ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి మిథున్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు
- తర్వాత భారీ ర్యాలీగా తహసీల్దారు ఆఫీస్ చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు
- ఈసారి తప్పకుండా మహబూబ్‌నగర్‌లో కాషాయ జెండా ఎగురుతుందని మిథున్ రెడ్డి అన్నారు
హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ప్రెస్ మీట్
- మార్పు కోసం ప్రజలు ముందుకు వస్తున్నారు
- హుజురాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తా
- రానున్న రోజుల్లో ప్రతి ఇంటి సభ్యుడిగా ఉంటా
- కష్ట సుఖాల్లో అండగా ఉంటా
- డిసెంబర్ 3న ప్రజలు తీర్పు ఇస్తారు.
సీఈవోతో ఆల్‌పార్టీ లీడర్స్ భేటీ
- హైదరాబాద్ బీఆర్కే భవన్లో ప్రారంభమైన ఆల్ పార్టీ మీటింగ్
- తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌తో సమావేశమై రాజకీయ పార్టీల ప్రతినిధులు
- నామినేషన్ల ప్రక్రియ, ప్రచారం తదితర అంశాలపై చర్చ
ఆయన ఒక ఏసీబీ మంత్రి..
- గతంలో మంత్రిగా చేసిన ప్రసాద్ కుమార్‌కు ఏసీబీ మంత్రి అని పేరుండేది
- ఆయన ఏసీబీ కేసుల్లో పైరవీలు చేసి డబ్బులు తీసుకునేవాడు
- నామినేషన్ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోపణ
కాంగ్రెస్ టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ టికెట్ రాలేదన్న బాధతో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాసుల బాలరాజు పురుగుల మందు తాగారు
- బాలరాజును డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మినారాయణ పరామర్శించారు
- పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామబాద్ ఆస్పత్రికి బాలరాజును తరలించారు
పారిశ్రామిక వేత్తలతో మీటింగ్‌లో కేటీఆర్ కామెంట్స్
- 2014 కు ముందు హైదరాబాద్ శివార్లలో 14 రోజులకు ఒక్కసారి నీళ్లు వచ్చేవి.
- ఇప్పుడు రోజు వస్తున్నాయ్ . రాబోయే రోజుల్లో 24 గంటలు నీళ్లిస్తాం.
- మీరు చూసింది ట్రైలర్ మాత్రేమే. అసలు సినిమా ముందుంది.
- 2014కు ముందు భూములు ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి.
- ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకి పరిశ్రమల వస్తున్నాయ్
- స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం వల్లే ఇది సాధ్యమవుతోంది.
- ప్రభుత్వంలో స్థిరత్వం లేకపోతే ముందుగా దెబ్బ తినేది పరిశ్రమలే
- అదే వేరే వాళ్ళు వస్తే వాళ్ళు ప్రతి దానికి ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తీసుకోవాలి
సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం
►సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం.
►సిర్పూర్ కాగజ్‌నగర్‌లో టేకాఫ్ కాని హెలికాప్టర్.
►సాంకేతిక సమస్య రావడంతో చాపర్ నిలిపివేసిన పైలట్.
►కాగజ్‌నగర్ నుంచి రోడ్డు మార్గాన అసిఫాబాద్ బయల్దేరిన సీఎం.
రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మంత్రి జగదీశ్ రెడ్డి
►తెలంగాణ రాజకీయాలు దిగజారుతున్నాయి
►కొన్ని పార్టీలు చెప్పుకోవడానికి ఏమి లేక ఇష్టానుసారం అబద్ధాలు, బూతు పదాలు వాడుతున్నారు.
►పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసిఆర్ పై వాడిన భాష అభ్యంతరంగా ఉంది.
►నీచంగా దిగజారుడుతనంగా తన భాష ఉంది.
►ఒక నాయకుడు మాట్లాడే మాటలు ఇవేనా?
►టిక్కెట్లు ఇవ్వలేని స్థితిలో అమ్ముకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి.
►చేసింది చెప్పుకొని ప్రజలను ఓట్లు అడగచ్చు.
►కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం.
►సీఎంకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.
జుక్కల్ కాంగ్రెస్‌లోనూ అసమ్మతి
► టికెట్ రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం మనస్తాపం
► తన స్వ గృహంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే సౌదగార్ గంగారాం.
► కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకే తన నిర్ణయం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీని వీడనని వెల్లడి.
►రేపు మద్నూర్‌లో రెండు సెట్ల నామినేషన్లు వేస్తా, భారీ సంఖ్యలో కార్యకర్తలు కదిలి రావాలంటూ పిలుపు.
►ఒకటి కాంగ్రెస్ రెబల్‌గా, మరొకటి ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేస్తానంటూ వెల్లడి.
తెలంగాణలో అద్భుతమైన పాలన: హరీష్ రావు
- తెలంగాణలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదు.
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హత్యలు, అత్యాచారాలే.
- కేటీఆర్ నాయకత్వంలో ఐటీలో తెలంగాణ మేటి.
- కేంద్రంపై సీరియస్ కామెంట్స్
- బీఆర్ఎస్ పథకాలను బీజేపీ కాపీ కొట్టింది.
పవన్‌కు ఓయూ విద్యార్థుల వార్నింగ్
- జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓయూ విద్యార్థుల వార్నింగ్
- పవన్ కల్యాణ్ ఒక బ్రోకర్.
- పవన్ ఓ ఐటమ్ సాంగ్ చేసే వ్యక్తి.
- ప్రజా సమస్యలపై పవన్ ఏనాడూ పోరాడలేదు.
- పవన్ ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోం.
- పవన్‌ను తరిమికొడతాం.
కిషన్‌రెడ్డిపై మంత్రి తలసాని సెటైర్లు
- ఓటమి భయంతోనే కిషన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు.
- రెండు సీట్లు గెలిచిన బీజేపీ.. బీజేపీని సీఎం ఎలా చేస్తారు?.
- తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ బీఆర్ఎస్సే.
- అన్ని సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగుతాయి.
నిజామాబాద్‌లో భారీ మెజార్టీతో గెలుస్తా: షబ్బీర్ అలీ
- నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ ఎన్నికల ప్రచారం.
- అధిష్టానం నిర్ణయం మేరకే నిజామాబాద్ నుంచి పోటీ.
- ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తాను.
- ముస్లిం మైనార్టీల ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్కు లేదు.
బీఆర్కే భవన్లో నేడు ఆల్ పార్టీ మీటింగ్
- ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు బీఆర్కే భవన్లో ఆల్ పార్టీ మీటింగ్.
- సీఈఓ వికాస్ రాజ్‌తో సమావేశం కానున్న అన్ని రాజకీయ పార్టీలు
- నామినేషన్ల ప్రక్రియ, ప్రచారం తదితర అంశాలపై చర్చ
పలువురు అభ్యర్థుల నామినేషన్ దాఖలు
- కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా డా. సంజయ్ నామినేషన్
- పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉపేందర్ రెడ్డి నామినేషన్
- మంథనిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పుట్ట మధు నామినేషన్
- జగిత్యాలలో బీజేపీ అభ్యర్థిగా శ్రావణి నామినేషన్ దాఖలు
- వరంగల్ తూర్పు బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్నపనేని నరేందర్ నామినేషన్
- ములుగు కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క నామినేషన్
నామినేషన్ వేసిన గంగుల కమలాకర్
- కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మంత్రి గంగుల కమలాకర్
- నామినేషన్ దాఖలుకు ముందు హనుమాన్ దేవస్థానం, యజ్ఞ వరాహస్వామి ఆలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు
- గంగుల కామెంట్స్..
- ఈరోజు మొదటి రెండు సెట్లు నామినేషన్లు వేశాను
- రేపు మరోసారి మరో రెండు నామినేషన్లు వేస్తాను
- ఆ వెంకటేశ్వరస్వామి, కేసీఆర్, ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తున్నాం
- కరీంనగర్లో చేసిన అభివృద్ధితో నాలుగోసారి గెలుస్తానన్న నమ్మకముంది
- ఈరోజు కరీంనగర్ నగరాన్ని మూడు వేల కోట్లతో అభివృద్ధి చేశాం
- రోడ్లు, నీళ్లతో పాటు.. పది వేల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టులు తెస్తానని హామీ ఇస్తున్నా..
- శాంతియుత వాతావరణాన్ని ప్రజలు కోరుకుంటున్నారు.
- 2018లో నన్ను గెలిపిస్తే కుట్రతో బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ నాపై కేసులు వేశారు
- వారెందుకు కేసులు వేశారో సమాధానం చెప్పాలి
- సంజయ్ కేసు కూడా న్యాయస్థానం కొట్టేస్తందన్న నమ్మకముంది
- కేబుల్ బ్రిడ్జి కూలిపోవాలని సంజయ్ కోరుకుంటున్నారు
- కూల్చేవారు కావాలా? నిర్మించేవారు కావాలా? ప్రజలు ఆలోచించాలి.
- మీది హిందుత్వ పార్టీ కదా..?
- మీకు దమ్ముంటే మోదీకి చెప్పి మేం కట్టే ఆలయాలకు నిధులు తీసుకురండి.
నేడు తెలంగాణ బీజేపీ ఐదో జాబితా!
- అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు బీజేపీ ఐదో జాబితా
- అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం.
- మరో 11 అసెంబ్లీ స్థానాలు పెండింగ్
- సంగారెడ్డి, మల్కాజ్గిరి, పెద్దపల్లి సీట్లపై కొనసాగుతున్న సస్పెన్స్
టీ-కాంగ్రెస్‌లో థర్డ్ లిస్ట్ ప్రకంపనలు..
- తెలంగాణ కాంగ్రెస్‌లో తారాస్థాయికి చేరిన అసమ్మతి జ్వాలలు
- బరిలో దిగుతామని తెగేసి చెబుతున్న అసంతృప్తులు
- గాంధీ భవన్లో బెల్లయ్య నాయక్ నిరసన!
- గాంధీ భవన్‌ను ముట్టడించిన ఆశావహులు.
- కొత్తవారికి టికెట్ ఇవ్వడంపై విమర్శలు
- టికెట్ రానివ్వకుండా చేసిన నేతలపై నిప్పులు
- నియోజకవర్గాల్లో సైతం మిన్నంటిన నిరసన సెగలు
- పటాన్చెరు టికెట్‌ను ఆశించిన కాట శ్రీనివాస్ గౌడ్
- కాటకు టికెట్ ఇవ్వకపోవడంతో గుర్రుగా దామోదర రాజనర్సింహ
- కాంగ్రెస్ నుంచి సత్తుపల్లి సీటు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి సంభాని
- నియోజకవర్గంలోని ఐదు మండలాల కార్యకర్తలతో సంభాని భేటీ
తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులకు ప్లాన్: పొంగులేటి
- ఎన్నికల వేళ తెలంగాణలో ఐడీ, ఈడీ దాడులు జరుగుతాయి.
- బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై దాడికి రెడీ అవుతున్నాయి.
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే దాడులకు ప్లాన్
- కాంగ్రెస్‌లో చేరిన తర్వాత బీఆర్ఎస్ సూచనల మేరకు దాడులు
- కేంద్ర సంస్థలు నామీద, నా కుటుంబ సభ్యుల మీద, నాకు మద్దతిచ్చే వారిపై దాడులకు రెడీ
- కాళేశ్వరం నిజ స్వరూపమేంటో కేంద్రం నివేదికల్లో వెల్లడైంది.
- కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతికి పాల్పడినట్టు అర్థం అవుతోంది.
- కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల ఏదో ఒకరోజు కూలిపోతాయి.
- కాళేశ్వరాన్ని కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారు.
- ఈ ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను మాయం చేసే అవకాశం ఉంది.
- తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి.
- ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది.
- ఈనెల 15వ తేదీ తర్వాత ప్రియాంక, రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారు.
- తెలంగాణలో దొరల పాలన వద్దు. ప్రజల పాలన కావాలి.
- ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారు.
- తెలంగాణ పోలీసులు వారి పరిధిలో పార్టీలకు అతీతంగా నడుచుకోవాలని సూచించారు.
మంత్రి గంగుల కమలాకర్‌కు ఊరట
- తెలంగాణ హైకోర్టులో మంత్రి గంగుల కమలాకర్‌కు ఊరట
- 2018లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్ కొట్టివేత
- కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్ కొట్టివేత.
- EP 28/2019 పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.
- ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు చేశారని పిటిషన్
- సరైన ఆధారాలు లేవని పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలి: తుమ్మల
- కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తుమ్మల నాగేశ్వర రావు స్పీడ్ పెంచారు.
- ఖమ్మంలోని 55వ డివిజన్లో తుమ్మల బుధవారం ప్రచారంలో పాల్గొన్నారు.
- ఖమ్మం లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం నాడు ఎమ్మేల్యే గా కృషి చేశాను.
- కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తాగునీటి పథకాలకు నిధులు తెచ్చాను.
- అవినీతి అక్రమ సంపాదన కోసం ఖమ్మంలో దౌర్జన్యం బెదిరింపులు చేస్తున్నారు.
- ఖమ్మంలో భూ కబ్జాలు లేకుండా ప్రశాంతమైన ఖమ్మం కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యం
- దేశం కోసం ఇందిరాగాంధీ కుటుంబం త్యాగం చేసింది.
- తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలి.
- అరాచకంలేని ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి.
నేడు నామినేషన్ వేయనున్న మంత్రి మల్లారెడ్డి
- మంత్రి మల్లారెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు.
- కీసరలో మల్లారెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
- కాసేపట్లో కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం, నామినేషన్ వేయనున్నారు.
కాంగ్రెస్ అమ్ముడుబోయే పార్టీ: బండి సంజయ్
► కరీంనగర్లో బండి సంజయ్ రెండో రోజు పాదయాత్ర ప్రచారం.
►కాపువాడ శివాలయం నుంచి 28, 29వ డివిజన్లలో ప్రచారాన్ని ప్రారంభించిన సంజయ్.
►కాంగ్రెస్ పార్టీ అమ్ముడుబోయే పార్టీ: బండి సంజయ్
►బీజేపీ దెబ్బకు మళ్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటయ్యే ప్రయత్నం చేస్తున్నాయి.
►కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగులకు బీఫామ్ ఇంతకాలం ఎందుకివ్వలేదు?
►కరీంనగర్లో అధికార బీఆర్ఎస్ అనుకూలమైనవాళ్లవి రెండు మెడికల్ కళాశాలలున్నాయనే ఇంతకాలం ప్రభుత్వ మెడికల్ కళాశాల తీసుకురాలేదు.
►ప్రజలను బీజేపీ వైపు నుంచి డైవర్ట్ చేసేందుకు నేను మూడో స్థానానికి వెళ్లి ఓడిపోతానన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
►అభివృద్ధి పేరిట ఓట్లడుగుతామనే అధికారపార్టీ నేతలు.. కరీంనగర్లో ఆర్వోబీ గురించి ఎందుకు మాట్లాడరు?
►పేదలకిచ్చే బియ్యం పైసల గురించెందుకు మాట్లాడరు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి గురించి ఎందుకు మాట్లాడుతలేరో చెప్పాలి?
►కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ రోడ్లను చూసి బఠాణీలమ్ముకునేవారు కూడా నవ్వుకుంటున్నారు.
►ముందు గంగుల ఆ పనులు చూసుకుంటే బెటర్.
నకిరేకల్ నియోజకవర్గంలో బీజేపీకి షాక్
►బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన చిట్యాల మాజీ జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ శేపూరి రవీందర్
►నకిరేకల్ బీజేపీ టికెట్ రాకపోవడంతో నిరసనగా రాజీనామా
►రవీందర్‌ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన మంత్రి జగదీష్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య
►అంగీకరించిన రవీందర్
►ఇవాళ హైదారాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
నేడు హైదరాబాద్‌కు ఖర్గే
- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు హైదరాబాద్‌కు రానున్నారు.
- ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖర్గే పాల్గొననున్నారు.
- అలాగే, టీపీసీసీ ముఖ్య నేతలతో ఖర్గే కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
రేపు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్
- సీఎం కేసీఆర్ రేపు(గురువారం) కామారెడ్డి నియోజకవర్గంలో నామినేషన్ వేయనున్నారు.
- హైదరాబాదు నుంచి హెలికాప్టర్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం వద్దకు చేరుకోనున్న సీఎం కేసీఆర్
- నేరుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్న సీఎం
- అనంతరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించనున్న కేసీఆర్.
- ప్రజా ఆశీర్వాద సభకు సుమారు లక్ష మంది జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
- జన సమీకరణపై ఎన్నికల ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఫుల్ బిజీ
కాంగ్రెస్‌కు షాక్!
- కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మానవతా రాయ్
- సత్తుపల్లి నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన మానవతారాయ్
- పార్టీ సభ్యత్వానికి, ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన సీనియర్ నేత
- 24 గంటల్లో పునరాలోచన చేసి టికెట్ ఇవ్వాలని డిమాండ్
- ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్‌కు లేఖ రాసిన మానవతారాయ్
నేడు ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటన
- నేడు ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ ఎన్నికల ప్రచారం
- ఉట్నూర్, ఖానాపూర్, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న రేవంత్
- ఖానాపూర్, ఆదిలాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించనున్న రేవంత్
- మధ్యాహ్నం 12 గంటలకు ఖానాపూర్‌లో బహిరంగ సభ
- మధ్యాహ్నం రెండు గంటలకు ఆదిలాబాద్ బహిరంగ సభ
- సాయంత్రం నాలుగు గంటలకు రాజేంద్రనగర్ బహిరంగ సభలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయం ఇలా..
- నేడు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ నామినేషన్
- భారీ బైక్ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయనున్న గంగుల.
- కరీంనగర్లో రెండో రోజు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం.
- కాపువాడ శివాలయం నుంచి పాదయాత్రగా ప్రచారం ప్రారంభించి 28,29 డివిజన్లలో ప్రచారం చేయనున్న సంజయ్
- మానకొండూరులో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న ఆరెపల్లి మోహన్
- ఆరెపల్లి నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్న బండి సంజయ్
- నేడు నామినేషన్ వేయనున్న మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు
- నేడు నామినేషన్ వేయనున్న చొప్పదండి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకర రవిశంకర్.
నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌కు సీఎం కేసీఆర్
- సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు.
- సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో బీఆర్ఎస్ సభలు
- బీఆర్ఎస్ ఆశ్వీరాద సభలకు సీఎం కేసీఆర్ హాజరు
Related News By Category
-
లోక్‌సభ ఎన్నికల్లో.. సత్తా చాటిన బీజేపీ.. పత్తాలేని బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో జాతీయస్థాయిలో హేమాహేమీలైన పలువురు నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ కోసం ప్రధా...
-
కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ.. రాక్షస పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? లేక పోలీస్ రాజ్యమా? అని ప్రశ్న...
-
’రేవంత్ సర్కార్ మహిళల్ని నమ్మించి మోసం చేసింది‘
సాక్షి,హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ...
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ టాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024, డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ...
-
సంక్షోభం.. సినీ రంగానికా? రాజకీయానికా?
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప -2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన విషయం చిలికి,చిలికి గాలివానగా మార్చడానికి రాజకీయ నేతలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. సినీ పరిశ్...
Related News By Tags
-
కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ.. ఇండియా టుడే సర్వే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్‌పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 119 అసెంబ్లీ ని...
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update.. ఎల్లుండి(డిసెంబర్ 3, ఆదివారం) తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు తెలంగాణ : లెక్కింపు కేంద్రాల ...
-
తెలంగాణలో ముగిసిన పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. కానీ, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారుల...
-
TS Elections: పలుచోట్ల ఉద్రిక్తత.. కోడ్ ఉల్లంఘిస్తున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ సీఈవో, సీని ప్రముఖులు, రాజకీయ నాయకులు...
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. ఈరోజు అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Updates.. ఈసీ సీఈఓ వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఉ.5:30 గం.లకు మాక్ పోలింగ్ రాజకీయ పార్టీల ఏజెంట్లు సమ...
Comments
Please login to add a commentAdd a comment