సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. రేపు(ఆదివారం) 58 మంది అభ్యర్థులతో కూడిన మొదటి లిస్ట్‌ను విడుదల చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో పొత్తులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. ఇక, భేటీ అనంతరం, మురళీధరన్ మాట్లాడుతూ.. రేపు తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తాం. తొలి జాబితాలో భాగంగా 58 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశాం. రేపు కాంగ్రెస్ అధిష్టానం మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది. మరో రెండు రోజుల్లో మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తాం.
సీపీఐ, సీపీఎం పొత్తులపై చర్చలు తుది దశలో ఉన్నాయి. రేపు పొత్తులపై స్పష్టత వస్తుంది. గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయులను అభ్యర్థులుగా ఎంపిక చేస్తాం. పార్టీ నుంచి నేతలు నేతలు బయటకు వెళ్లడం మా పార్టీ అంతర్గత విషయం. ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుంది. 119 స్థానాల్లో మెజార్టీ పార్టీ నేతలకు సీట్ల కేటాయింపు ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: పొన్నాలతో కేటీఆర్ భేటీ.. బీఆర్‌ఎస్‌లో చేరిక ఎప్పుడంటే..
Comments
Please login to add a commentAdd a comment