ఎమ్మెల్యేల అరెస్టు ప్రభుత్వ దుర్మార్గపు చర్య: రేవంత్‌  | TPCC Chief Revanth Reddy Slams On CM KCR Over CLP Team Custody Incident | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల అరెస్టు ప్రభుత్వ దుర్మార్గపు చర్య: రేవంత్‌ 

Published Wed, Aug 17 2022 1:16 AM | Last Updated on Wed, Aug 17 2022 1:16 AM

TPCC Chief Revanth Reddy Slams On CM KCR Over CLP Team Custody Incident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పోదెం వీరయ్యలను అరెస్ట్‌ చేయడం ప్రభుత్వ దుర్మార్గ చర్య అని, వారి అరెస్టులను, నిర్బంధ కాండను తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని, సీఎం కేసీఆర్‌కు ప్రజల చేతిలో శిక్ష తప్పదని మంగళవారం ఒక ప్రకటనలో రేవంత్‌ హెచ్చరించారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతికి పాల్పడకపోతే పరిశీలనకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు. సీఎల్పీ బృందానికి ప్రభుత్వమే దగ్గరుండి ప్రాజెక్టులను చూపించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడతామని రేవంత్‌ హెచ్చరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement