సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో, సీట్ల కేటాయింపులో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంది. ఇక, తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను రెండు స్థానాల్లో బరిలో నిలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.
కాగా, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ స్థానం రేవంత్‌ను పోటీ చేయాలని ఏఐసీసీ ఆదేశించింది. ఈ క్రమంలో ఈనెల ఎనిమిదో తేదీన రేవంత్ కామారెడ్డి(kamareddy)లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే, ఈనెల ఆరో తేదీన కొడంగల్‌లో రేవంత్ నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో రేవంత్ భేటీ అయ్యారు. ఇక, సీఎం కేసీఆర్ పోటీలో ఉన్న స్థానం నుంచి రేవంత్ బరిలో దిగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవైపు.. నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ పోటీ చేయనున్నారు. ఇక, షబ్బీర్ అలీ నామినేషన్‌కు రేవంత్ వెళ్లనున్నారు. అయితే, సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలో ఉండటం షబ్బీర్ అలీ అక్కడ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలసిందే.
ఇది కూడా చదవండి: టీడీపీ నేత మాగంటి బాబుకు బిగ్ షాక్.. పోలీసు నోటీసులు జారీ
Comments
Please login to add a commentAdd a comment