తెలంగాణ: కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల | TS elections 2023: Kharge Released Telangana Congress Manifesto | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. అభయ హస్తం పేరిట విడుదల

Nov 17 2023 12:48 PM | Updated on Nov 18 2023 4:35 PM

TS elections 2023: Kharge Released Telangana Congress Manifesto - Sakshi

ఆరు గ్యారెంటీల్ని కలిపేసుకుని 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్‌లో మరో 13 అంశాల్ని చేర్చి..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల హామీల బుక్‌లెట్‌ ‘అభయ హస్తం’ను విడుదల చేశారు. ఆరు గ్యారెంటీల్ని కలిపేసుకుని 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్‌లో మరో 13 అంశాల్ని చేర్చి.. మొత్తం  42 పేజీలతో అభయ హస్తం ఉంది.  ఈ విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి,  సీఏల్పీ నేత భట్టి‌‌,శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రధానాంశాలు

  • వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్‌
  • తెలంగాణ ఉదమ్యకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.. గౌరవ భృతి
  • తొలి కేబినెట్‌లో మెగా డీఎస్సీ
  • మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు
  • గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం
  • రేషన్‌ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్‌
  • ప్రతి ఏటా రైతు భరోసా
  • రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు
  • వరి క్వింటాలుకు రూ.500 బోనస్‌
  • వ్యవసాయ కూలీలకు ఏడాది రూ.12,000
  • ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌
  • చేయూత పింఛన్‌ రూ. 4,000
  • ఇల్లు లేని వారికి ఇంటి స్థలానికి రూ.5 లక్షలు
  • విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు 
  • కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ
  • మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2,500 ఖాతాలోకి
  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 
  • విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్‌
  • వైద్య రంగం బడ్జెట్‌ పెంపు
  • ధరణి పోర్టల్‌ రద్దు.. ఆ స్థానంలో భూమాత పోర్టల్‌
  • రేషన్‌ ద్వారా సన్న బియ్యం
  • ఆర్టీసీ విలీన‍ ప్రక్రియ పూర్తి చేయడం
  • రూ. 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి
  • ఎన్నారై సంక్షేమ బోర్డు
  • దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్‌
  • ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌
  • ప్రతీ మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌. 
  • చేయూత పెన్షన్‌ రూ.4వేలు
  • మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల ఖాతాలో రూ.2500
  • రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌
  • నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం
  • ఖమ్మం, ఆదిలాబాద్‌ నూతన విశ్వవిద్యాలయాలు
  • కొత్త రేషన్‌ కార్డులు జారీ
  • ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేల సాయం
  • పోటీ పరీక్షలకు ఫీజు రద్దు
  • సీఎం కార్యాలయంలో ప్రతీరోజు ప్రజా దర్బార్‌..  ఇలా ఇంకా ఉన్నాయి.. 


ఇంతకు ముందు కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇవే..

1. మహాలక్ష్మి

  • మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సాయం
  • రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌
  • మహిళలకు రాష్ట్ర మంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పయ్రాణం

2. రైతు భరోసా

  • రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం. రైతుకూలీలకు, భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల సాయం.
  • వరి పంటకు మద్దతు ధర కల్పించడంతోపాటు రూ 500 బోనస్‌ అందజేత

3. గృహ జ్యోతి

  • రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా

4. ఇందిరమ్మ ఇళ్లు

  • ఇల్లు లేని ప్రతి కుటుంబానికీ ఇంటిస్థలం. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
  • అదనంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం అందజేత.

5. యువవికాసం

  • విద్యార్థులకు విద్య భరోసా కార్డు అందజేత. రూ.5 లక్షల వ్యయ పరిమితితో, వడ్డీ రహిత ఆర్థిక సహాయక కార్డు అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్‌ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్‌ కొనుగోలు, హాస్టల్‌ ఫీజులు, ల్యాప్‌టాప్‌, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సదుపాయ కల్పన.
  • ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు.

6. చేయూత

  • ప్రతి నెలా రూ.4 వేల చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్‌, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పింఛన్ల అందజేత.
  • పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. 
‘‘తెలంగాణ కాంగ్రెస్ కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్.. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారు. నమ్ముకున్నవారికి ద్రోహం చేశారు... పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారు వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ తుపాను రాబోతోంది మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారు.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి’’

👉: కాంగ్రెస్‌ మేనిఫెస్టో పూర్తి కాపీ కోసం క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement