
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల కోటాలో 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 8 జిల్లాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 16న గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేసిన స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనంతపురం నుంచి యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్, మొండితోక అరుణ్‌కుమార్, తూర్పుగోదావరి నుంచి అనంత సత్యఉదయ్‌భాస్కర్, గుంటూరు నుంచి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖపట్నం నుంచి వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, చిత్తూరు నుంచి కృష్ణరాఘవ జయేంద్రభరత్, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావులు ఎన్నికైనట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment