దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. దాదాపు 100 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులని గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశంలో త్వరలో ప్రారంభం కానున్న ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను కావడం గమనార్హం.
మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జాతీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. దేశంలో ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే.. సాధారణ మెజారిటీగా 272 సీట్లు గెలుచుకోవాలి ఉంటుంది. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 303 సీట్లు గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) 52 సీట్లకు పరిమితమైంది. పోటీ చేసే స్థానాలతో పాటు, భారత రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో-ఇండియన్లను లోక్‌సభకు నామినేట్ చేయవచ్చు.
ఎన్నికలు ఎక్కడ & ఎప్పుడు జరుగుతాయి?
భారతదేశంలో జరగనున్న ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమీషన్ ఇప్పటికే విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఎన్నికలు మొత్తం దేశవ్యాప్తంగా జరగున్నాయి. దీనికి సంబంధించిన పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, వాటికి కావాల్సిన కట్టుదిట్టమైన భద్రతను ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లోని బటన్‌ను నొక్కడం ద్వారా ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవచ్చు. ఈ విధానం 1982లో మొదటిసారి అమలులోకి వచ్చినప్పటికీ.. 2000 ప్రారంభం నుంచి విరివిగా అందుబాటులోకి వచ్చాయి.
ఓటింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఓటు వేయడానికి అర్హులు ఎవరు?
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ విధానాన్ని అనుసరిస్తుంది. ఓటర్లు ఒక నియోజకవర్గంలో ఒకే అభ్యర్థికి ఓటు వేస్తారు. ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి అక్కడ గెలుస్తారు. ఓటు వేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు.. అయితే ఎన్నికల్లో పోటీ చేసే పోటీదారు వయసు కనీసం 25 సంవత్సరాలు ఉండాలి.
దేశంలో మొత్తం 968 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో 497 మిలియన్ల పురుషులు, 471 మిలియన్ల మహిళలు ఉన్నారు. పురుషుల కంటే ఎక్కువ శాతం మహిళా ఓటర్లు వరుసగా రెండోసారి ఓటు వేసే అవకాశం పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రధాన అభ్యర్థులు ఎవరు?
ఎలక్షన్ రేసులో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. మోదీ మాత్రమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత రాహుల్ గాంధీ ఉన్నారు. ఇకపోతే ఈ సారి సోనియా గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించింది.
జరగబోయితే ఎన్నికలు ఎందుకు ముఖ్యమైనవి?
ఇప్పటివరకు వరుసగా మూడు సార్లు దేశ ప్రధాని పీఠం సొంతం చేసుకున్నవారు జవహర్‌లాల్ నెహ్రూ మాత్రమే. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో మోదీ మూడోసారి గెలిస్తే నెహ్రూ రికార్డుకు చేరుకుంటారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత్)గా చేస్తామని కంకణం కట్టుకున్నారు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మూడో స్థానం పొందుతుందని మోదీ గ్యారంటీ ఇచ్చారు.
కొన్ని గణాంకాల ప్రకారం.. దేశంలోని మొత్తం జనాభాలో 80 శాతం మంది హిందువుల నుంచి బీజేపీకి మద్దతు లభిస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా దేశంలోని ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థను కాపాడేందుకు.. రైతులకు అండగా నిలబడేందుకు, ఉద్యోగాల కల్పనకు కాంగ్రెస్ అధికారంలోకి రావడం ముఖ్యమని మరోవైపు ఇండియా కూటమి చెబుతోంది. జూన్ 4న ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారనేది తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment