
సాక్షి, గుంటూరు: గత ఐదేళ్ల పాటు ప్రజలకు అన్నీ తానై అండదండగా నిలిచారు వైఎస్ జగన్. ‘ఓటమి తాత్కాలికమే.. ఎప్పటికీ నువ్వే మా కింగ్’.. మీపై అభిమానం ఏమాత్రం చెక్కుచెదరలేదు అంటూ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఉన్న ఇమేజ్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయన ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.

‘ఎక్కడ వున్న రాజు రాజే గెలుపు ఓటములు సహజం.. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మీకే అవకాశం. మా హృదయాల్లో ఎప్పటికీ ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, పేజీలకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. కాగా, ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 40 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. 2019లో పోలిస్తే 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. మేనిఫెస్టో హామీలను 99 శాతానికిపైగా అమలు చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గడం, కొందరు పోలీసు అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్‌మెంట్‌పై అనుమానాలు, పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు తగ్గినా వైఎస్సార్‌సీపీకి 40 శాతం ఓట్లు రావడం వెనుక ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ చేసిన కృషి ఎంతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment