సాక్షి, అమరావతి: గతంలో చంద్రబాబు ముంచేసిన పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ చేయూత అందించారని రాష్ట్రంలో కొత్తగా 2 లక్షలు ఉద్యోగాలు వచ్చాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. శానస సభలో ‘పారిశ్రామికాభివృద్ధి-పెట్టుబడులు’పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, కరోనా సంక్షోభంలో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీలిచ్చి పరిశ్రమలకు అండగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా పోర్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయస్థాయిలో పోటీపడి బల్క్ డ్రగ్ పార్క్ సాధించామన్నారు.
చదవండి: ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా: సీఎం జగన్
ఏపీలో వందేళ్ల తర్వాత రీసర్వే జరుగుతోందన్నారు. రీ సర్వే ద్వారా ఎంతో మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక రంగం చాలా ఇబ్బందులకు గురైందన్నారు. గతంలో ఏపీలో పర్రిశమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు లభించడంతో పాటు, చక్కటి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవడం తప్ప, అమలు పరిచిన పరిస్థితి లేదన్నారు.
గతంలో ఓ టీడీపీ నేత సిగ్గు లేకుండా తనను లంచం అడిగాడని బ్రహ్మ నాయుడు మండిపడ్డారు. టీడీపీ హయాంలో తనకు జరిగిన ఘటన గురించి ఆయన వివరిస్తూ.. తాను 2012లో గౌతమ్‌బుద్ధ టెక్సాస్ పార్క్ పేరిట టెండర్ వేశానని, టెండర్ తనకే వచ్చిందన్నారు. డబ్బులు చెల్లించడంతో రిజిస్ట్రేషన్ కూడా జరిగిందన్నారు. కేంద్రం నుంచి రూ. 40 కోట్లు సబ్సిడీ కూడా వచ్చిందన్నారు. సబ్సీడీ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. రూ.40 కోట్లు సబ్సిడీలో తమకు రూ.20 కోట్లు లంచం ఇవ్వాలని, లేకపోతే అనుమతి ఇచ్చేదిలేదని చిలకలూరిపేటకు చెందిన టీడీపీ మంత్రి డిమాండ్ చేశారని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment