
అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాడిన పూలే
ఒంగోలు సిటీ: పేదలు, బహుజనులు, గిరిజనుల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి జ్యోతీరావు పూలే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జ్యోతిరావ్ పూలే చిత్రపటానికి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జ్యోతీరావు పూలే ఉద్యమకారుడు, సంఘసంస్కర్త అని కొనియాడారు. ఇటువంటి నాయకులు చేసిన సేవను గుర్తించుకొని మా నాయకుడు కూడా బహుజనులు, పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పూలేను ఎప్పటికీ గుర్తు పెట్టుకొని పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ విద్యావ్యాప్తి ద్వారా సాంఘిక అసమానతలు తొలగిపోతాయని జ్యోతీరావుపూలే భావించాడనీ, ఆయన అడుగు జాడల్లో అందరం నడుద్దామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, మహిళా విభాగం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, బడుగు ఇందిర, వైఎస్సార్ సీపీ నాయకులు బొట్ల రామారావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, సాధం విజయలక్ష్మి, దాసరి కరుణాకర్, పిగిలి శ్రీను, కోటి యాదవ్, పి.ఆంజనేయులు, దుంపా చెంచిరెడ్డి, మహానందరెడ్డి, ఇమ్రాన్‌ఖాన్, గౌడ్, బొట్ల మాల్యాద్రి, బొడ్డు వేణు, భాను, పుసమర్తి బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జ్యోతీరావుపూలే 199వ జయంతి వేడుకలు పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
పూలేకి నివాళులర్పిస్తున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ, చుండూరి రవిబాబు తదితరులు