రంగుమారిన ‘భగీరథ’
చందుర్తి(వేములవాడ): మండలంలోని మల్యాలలో ఐదురోజులుగా భగీరథ నీరు రంగుమారి సరఫరా కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో తాగునీరు సరఫరా చేసేందుకు మంచి నీటి బావులు, బోర్లు, ట్యాంకులు ఉన్నా.. గ్రామపంచాయతీ సిబ్బంది తమకు మూడునెలలుగా వే తనాలు లేవని, బావులు గ్రామానికి దూరంగా ఉ న్నాయని, గ్రామానికి సంబంధించి నీరు సరఫరా చేయాలన్న చేయడం లేదు. ఐదురోజులు రంగు మారిననీరు సరఫరా కావడంతో వాటిని కాళ్లు, చే తులు కడుక్కునేందుకు కూడా గ్రామస్తులు సాహసించడం లేదు. అధికారులు స్పందించి స్వచ్ఛమైన భగీరథ నీరు సరఫరా చేయాలని, లేకుంట గ్రామంలోని బావులు, బోర్లను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయమై భగీరథ గ్రిడ్ ఏఈ అనిల్‌ను వివరణ కోరగా, మిడ్‌మానేరు నీటి తరలింపుతో రంగుమారిన నీళ్లు సరఫరా అవుతున్నాయని, సోమవారం నుంచి సమస్య ఉండదన్నారు. ఇదే పరిస్థితి ఉంటే లోకల్ నీటి ని వాడుకోవాలని చెబుతామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment