
భక్తులకు అన్ని సౌకర్యాలు
వేములవాడ: భక్తులకు అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ అధికారులను ఆదేశించారు. వేములవాడలోని అన్నదానసత్రం, బద్దిపోచమ్మ ఆలయ ప నులు, తాగునీటి సౌకర్యం, జాతర పనులను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి సోమవారం పరి శీలించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో మొక్కులు చెల్లించుకుని తిరిగి ఇంటికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రద్దీ పెరిగే అవకాశాలున్నాయని, ఆమేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జలప్రసాదం వద్ద ఓపెన్ డ్రైన్‌ను పూడ్చాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో శానిటేషన్ ఎప్పటికప్పటికప్పుడు సరిచేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment