స్నానానికి వెళ్లి.. చెరువులో పడి
ఆగిర్యాలలో వ్యక్తి దుర్మరణం
కొందుర్గు: స్నానం చేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన ఘటన మండలంలోని ఆగిర్యాలలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవీందర్ నాయక్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శంకరయ్య(30) శనివారం మద్యాహ్నం 2 గంటల సమయంలో ఆగిర్యాల శివారులోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి, అందులో పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు చెరువు వద్దకు చేరుకొని గాలించగా మృతదేహం లభించింది. మృతుడి తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment