చేవెళ్ల: మున్సిపాలిటీ పరిధిలోని శంకర్‌పల్లి ప్రధాన రోడ్డు పక్కన డంపింగ్‌లా వేసిన చెత్తను మున్సిపల్ అధికారులు బుధవారం తొలగించారు. సాక్షిలో ప్రచురితమైన మున్సిపాలిటీలలో లోపిస్తున్న పారిశుద్ధ్యం అనే కథనానికి స్పందించారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద, శంకర్‌పల్లి ప్రధాన రోడ్డుపక్కన వేసిన చెత్త డంపింగ్‌లను పూర్తిగా తొలగించి శుభ్రం చేశారు. ప్రజలు అందరూ కూడా మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ కోరారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదని ఇళ్ల వద్దకే వచ్చే వాహనాల్లో వేయాలని సూచించారు.
చెత్తను శుభ్రం చేయించిన అధికారులు