నందిగామ: బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన రాజ్‌భూపాల్‌గౌడ్‌ను బీజేపీ మండల అధ్యక్షుడు వడ్ల అరవింద్ ఘనంగా సన్మానించారు. శుక్రవారం ఆయన పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి శంషాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు. ఈ సంరద్భంగా అరవింద్ మాట్లాడుతూ.. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందనేందుకు రాజ్‌భూపాల్‌గౌడ్ ప్రత్యక్ష సాక్షి అన్నారు. పార్టీ ఆయన సేవలను గుర్తంచి పార్టీ రూరల్ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మనోహర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్, నాయకులు కమ్మరి భూపాల్ చారి తదితరులు పాల్గొన్నారు.
అభినందనల వెల్లువ
ఇబ్రహీంపట్నం: బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌ను ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నేతలు శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా భూపాల్‌గౌడ్‌ను శాలువతో సన్మానించి, మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, శ్రీశైలం, రమణారెడ్డి, బుగ్గారెడ్డి, స్వామిగౌడ్, నర్సింహ, బాలశివుడు, బాబు, కృష్ణ, రాజు, విజయ్, సురేశ్, శేఖర్, దాసరి, రవి, యాదయ్య, వెంకట్‌రమణ పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడికి సన్మానం