చేవెళ్ల: ఈ నెలాఖరు వరకు గ్రామాల్లో వందశాతం పన్నుల వసూలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు డీఎల్‌పీఓ సతీష్‌కుమార్ అన్నారు. మండలంలోని ఆలూరు, రేగడిఘనాపూర్, ఖానాపూర్ గ్రామాల్లో శనివారం పన్నుల వసూళ్ల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి పన్నులు సేకరించి రసీదులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డివిజన్‌లోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లో ఇప్పటి వరకు 82 శాతం పన్నులు వసూలైనట్లు తెలిపారు. ఈ నెలాఖరు వరకు వందశాతం పూర్తి చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. అన్ని మండలాలు వందశాతం లక్ష్యాలను చేరుకోవాలని ఆయా మండలాల ఎంపీలు, కార్యదర్శులకు సూచించారు. ప్రజలు కూడా సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ విఠలేశ్వర్‌జీ, ఆయా గ్రామాల కార్యదర్శులు ఉన్నారు.