కృత్రిమ గర్భాశయం! | Global Artificial Womb Market: Andhra pradesh | Sakshi
Sakshi News home page

కృత్రిమ గర్భాశయం!

Published Wed, Nov 13 2024 6:06 AM | Last Updated on Wed, Nov 13 2024 6:19 AM

Global Artificial Womb Market: Andhra pradesh

ఏఐ పరిజ్ఞానంతో రూపొందించిన జర్మనీ శాస్త్రవేత్త 

ప్రసూతి మరణాలు, సిజేరియన్‌ కష్టాలకు విరుగుడు  

వ్యాధి కారక జీన్స్‌ను తొలగించుకునే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ గర్భాశయం మార్కెట్‌ అంచనాలు ఇలా..

2023కి మార్కెట్‌ విలువ: 311.1 మిలియన్‌ డాలర్లు

2030కి మార్కెట్‌ విలువ: 566.88 మిలియన్‌ డాలర్లు

వార్షిక వృద్ధిరేటు: 8.95 శాతం

కృత్రిమ గర్భాశయాల ద్వారా తగ్గనున్న ముందస్తు (ప్రీ మెచ్యూర్‌) జననాలు: 90 శాతం

ఏపీ సెంట్రల్‌ డెస్క్‌: సాంకేతిక విజ్ఞానం కలబోతతో కృత్రిమ మేథస్సు (ఏఐ) ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది! సృష్టికి ప్రతిసృష్టి జరుగుతోంది. తాము కోరుకున్న లక్షణాలతో పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యేలా కృత్రిమ గర్భాశయం తొలిసారిగా ఆవిష్కృతమైంది. జర్మనీకి చెందిన శాస్త్రవేత్త హషీం అల్‌ ఘైలీ ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ గర్భాశయాన్ని సృష్టించారు.

‘ఎక్టో లైఫ్‌’ అని అని వ్యవహరించే ఈ కృత్రిమ ల్యాబ్‌ ద్వారా ఏటా 30,000 మంది శిశువులకు పురుడు పోయవచ్చని చెబుతున్నారు. క్షీణిస్తున్న జన సంఖ్యతో సతమతమవుతున్న జపాన్, బల్గేరియా, దక్షిణ కొరియా లాంటి చాలా దేశాలకు ఎక్టో లైఫ్‌ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఈ దేశాల్లో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతుండగా జననాల రేటు చాలా తక్కువగా ఉంది. 

‘క్యాన్సర్‌ తదితర ప్రాణాంతక జబ్బుల కారణంగా గర్భాశయాన్ని శస్త్ర చికిత్స ద్వారా  తొలగించిన మహిళలకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. ‘ఎక్టో లైఫ్‌’ అందుబాటులోకి రావడం ద్వారా నెలలు నిండక ముందే శిశువుల జననం, సిజేరియన్‌ కష్టాలు లాంటివి ఇకపై గత అనుభవాలుగానే మిగలనున్నాయి’ అని హషీం పేర్కొన్నారు.  

ప్రసూతి మరణాలకు అడ్డుకట్ట 
‘ప్రపంచవ్యాప్తంగా ఏటా మూడు లక్షల మందికిపైగా మహిళలు ప్రసూతి సమస్యలతో మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎక్టో లైఫ్‌కృత్రిమ గర్భాశయంతో ఇలాంటి సమస్యలు, శస్త్ర చికిత్స ద్వారా కాన్పులకు  తెర దించవచ్చు’అని హషీం తెలిపారు.

‘ఏఐ’ పాత్ర ఏమిటంటే..?
శాస్త్రవేత్తలు సృష్టించిన కృత్రిమ గర్భాశయాన్ని నిరంతరం కనిపెట్టుకుంటూ కంటికి రెప్పలా కాపాడేది ‘కృత్రిమ మేథస్సు’ పరిజ్ఞానమే. సరిగ్గా చెప్పాలంటే.. గర్భం దాల్చిన అమ్మ పాత్రను ‘ఏఐ’ పోషిస్తుంది.  
కృత్రిమ గర్భాశయంలోకి పిండాన్ని ప్రవేశపెట్టటానికి ముందే మంచి లక్షణాలున్న జీన్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.  

300 రకాల జీన్స్‌ నుంచి కళ్ల రంగు, జుత్తు, పొడవు, దేహ దారుఢ్యం, మేధోశక్తిని ల్యాబ్‌  
‘ఎలైట్‌ ప్యాకేజీ’ ద్వారా ఎంపికకు వీలుంది.  
ఆకర్షణీయమైన లక్షణాలను ఎంపిక చేసుకోవడంతోపాటు జన్యుపరమైన వ్యాధులను వారసత్వంగా మోసుకొచ్చే అవాంఛిత జీన్స్‌ను 
తొలగించుకోవడం ద్వారా బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించేందుకు దోహదం చేస్తుంది.  

‘అంటువ్యాధులు (ఇన్ఫెక్షన్లు) సోకకుండా  ఆరోగ్యకరమైన వాతావరణంలో పాపాయి పురుడు పోసుకునేలా ఎక్టో లైఫ్‌ భద్రంగా తనలో దాచుకుంటుంది. దీని ఉపరితలానికి సూక్ష్మ క్రిములు అంటుకోకుండా వీటి ప్యాడ్స్‌ను రూపొందించాం. ప్రతి పరికరంలోనూ ఏఐతో అనుసంధానించిన సెన్సార్లు ఉంటాయి. బిడ్డ శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పసిగడతాయి. పసిగుడ్డు గుండె కొట్టుకునే వేగం, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, శ్వాస తీసుకునే రేటు, ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు విశ్లేíÙంచి సమాచారం అందిస్తుంటాయి. అంతేకాకుండా ఏఐ పరిజ్ఞానం బిడ్డ శారీరక లక్షణాలను కూడా గమనిస్తూ ఏవైనా జన్యుపరమైన రుగ్మతలను పసిగడితే వెంటనే తెలియచేస్తుంది’ అని హషీం చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement