
ఈరోజుల్లో విషయం ఎలాంటిదైనా సరే దావానంలా వ్యాపిస్తోంది సోషల్ మీడియా వల్లే. మనిషిని సామాజిక మాధ్యమాలకు అంతగా అతుక్కుపోయేలా చేసింది స్మార్ట్‌ఫోన్. రంగం ఏదైనా సరే మంచి-చెడు రెండింటి గురించి ఇక్కడే ఎక్కువ చర్చ నడుస్తోంది. అలాగే ఛాలెంజ్‌లు, ట్రెండింగ్, ట్రెండ్‌ల విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. తాజాగా జస్ట్ వన్ వర్డ్ అంటూ ట్విటర్‌లో ఒక్క ముక్కలో చెప్పాలనుకునే ట్రెండ్ ఒకటి నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కూడా భాగం అయ్యారు.
ఆరు నెలలకు పైనే గడుస్తున్నా.. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్ నగరాలు బాంబులు, రష్యా క్షిపణులతో దిబ్బలుగా మారిపోయాయి. రష్యా బలగాలతో పోలిస్తే ఎన్నో రెట్లు బలహీనమైన ఉక్రెయిన్.. ఇంతకాలం పాటు రష్యాను నిలవరించడం ఆశ్చర్యపరిచేదే. పాశ్చాత్య దేశాల మద్దతు వల్లనో.. ఉక్రెయిన్ బలగాల మనోధైర్యం వల్లనో ఈ యుద్ధం ముందుకు సాగుతోంది. అయితే.. తాజాగా వన్ వర్డ్ ట్రెండ్‌లో భాగంగా.. ‘ఫ్రీడమ్’ అంటూ తన ట్విటర్ అకౌంటర్‌లో సందేశం ఉంచారు జెలెన్‌స్కీ.
Freedom
— Володимир Зеленський (@ZelenskyyUa) September 2, 2022
జెలెన్‌స్కీ చేసిన ఒక్క పదం.. ఇప్పుడు నెటిజన్స్ మనుసు దోచుకుంటోంది. ఉక్రెయిన్‌కు ఏం కావాలో ఒక్క మాటలో జెలెన్‌స్కీ చేసిన ట్వీట్ ఆంతర్యమన్నది క్లియర్‌గా తెలిసిపోతోంది. రష్యా నుంచి తమ దేశం స్వాతంత్రం కోరుకుంటోందని చెప్పడమే అవుతుంది దానికి అర్థం. ప్రస్తుతం ఈ ట్వీట్‌కు రికార్డు స్థాయిలో లైకులు దక్కడం గమనార్హం.
ఏంటీ వన్ వర్డ్ ట్రెండ్..
ట్విటర్‌ను ప్రస్తుతం One-Word Trend కుదిపేస్తోంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులంతా ఈ ట్రెండ్‌లో పాల్గొంటున్నారు. చెప్పాలనుకున్న విషయాన్ని సింపుల్‌గా ఒక్క పదంలో చెప్పడం ఈ ట్రెండ్ ఉద్దేశం. అమెరికా రైల్వే సర్వీస్ ప్రొవైడర్ అమ్‌ట్రాక్ గురువారం ‘ట్రెయిన్స్’ అనే పదం ఉంచింది. అక్కడి నుంచి ఈ వన్ వర్డ్ ట్రెండ్ మొదలైందని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు సచిన్ లాంటి ప్రముఖ స్పోర్ట్స్ పర్సనాలిటీ కూడా ఇందులో పాల్గొన్నారు.
వన్ వర్డ్ ట్రెండ్.. ఇప్పుడు ట్విటర్‌లో అద్భుతాలు చేస్తోంది. ఆసక్తులు, నమ్మకాలు.. తెలిసిన విషయాలు.. ఇలా ఏదైనా సరే ఒకేఒక్క ముక్కలో చెప్పే మార్గం ఇది. స్టార్‌బక్స్, డోమినోస్.. నాసా.. ఇలా అన్నీ ట్విటర్‌లో ఈ ట్రెండ్‌లో పాల్గొన్నాయ్ కూడా.
democracy
— President Biden (@POTUS) September 2, 2022
cricket
— Sachin Tendulkar (@sachin_rt) September 2, 2022
coffee
— Starbucks Coffee (@Starbucks) September 1, 2022
pineapple
— Domino's Pizza (@dominos) September 1, 2022
universe
— NASA (@NASA) September 1, 2022
Comments
Please login to add a commentAdd a comment