
కొండాపూర్(సంగారెడ్డి): సంగారెడ్డికి చెందిన నక్క లక్ష్మీ ప్రియాంకకు కేంద్రీ య విశ్వ విద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డాక్టరేట్ ప్రకటించింది. సైకాలజీ రంగంలో ఆమె పీహెచ్‌డీ పూర్తి చేసింది.
ప్రొఫెసర్ మీనా హరిహరన్ పర్యవేక్షణలో అడొలిసెన్స్ స్ట్రెస్ స్కేల్‌పై పరిశోధన చేసింది. ఈ పరిశోధన లో ఆడపిల్లలు, మగ పిల్లల కంటే ఎక్కువ మానసిక ఒత్తిడి గురి అవుతున్నారని కనుగొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, ఒత్తిడి దేని వల్లో తెలుసుకొని, స్కూల్స్, కౌన్సెలింగ్ సెంటర్‌లో వారికి తగిన సహాయం చేసే అవకాశం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment