ఘనంగా స్వయం పాలన దినోత్సవం
వట్‌పల్లి(అందోల్): అందోల్ మండలంలోని తాడ్మన్నూర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులు వ్యవహరించి అలరించారు. ప్రధానోపాధ్యాయులుగా అక్షిత, డీఈఓగా దుర్గారాజ్, ఎంఈఓగా శ్రీహరి, కలెక్టర్‌గా చరణ్, ఉపాధ్యాయులుగా భవాని, వైష్ణవి, భానుప్రియ, భార్గవి, రేణుక, రఘువర్ధన్, వినయ్, రఘు, దీక్షిత్, అశ్రిన్, శ్రీహితలు వ్యవహరించారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె.నవీన్‌న్‌కుమార్, ఉపాధ్యాయులు గీత, మల్లేశ్వరి, వినోద, క్రిష్ణారెడ్డి, అఖిల పాల్గొన్నారు.
పిచరాగడి ప్రభుత్వ పాఠశాలలో..
జహీరాబాద్: కోహీర్ మండలంలోని పిచరాగడి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సోమవారం స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు పాఠాలు బోధించి ప్రశంసలు అందుకున్నారు. హెచ్‌ఎంగా తేజేష్, ఎంఈఓగా రాజేష్, డీఈఓగా నగేష్, ఉపాధ్యాయులుగా స్వాతి అక్షయ, స్నేహ, సుప్రియ, రోహిత్, ఇస్మాయిల్, కార్తీక్, పవన్, అభిషేక్, షైబాజ్ విధులు నిర్వహించి పాఠాలు బోధించారు.
ఘనంగా స్వయం పాలన దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment