
గదరాజు చందుకు కేసీఆర్ అభినందనలు
చేర్యాల(సిద్దిపేట): ఇటీవల డాక్టరేట్ పట్టా పొందిన మండలంలోని కడవేర్గు గ్రామానికి చెందిన గదరాజు చందును మాజీ సీఎం కేసీఆర్ అభినందించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి కేసీఆర్‌ను కలిశారు. చందు ఇటీవల ఓయూ ప్రొఫెసర్ ఎం.గోనానాయక్ పర్యవేక్షణలో రాష్ట్రంలో దొమ్మర కులస్తుల సంస్కృతీ, సాహిత్య పరిశీలన అంశంపై పరిశోధన చేసి పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని కేసీఆర్‌కు అందజేసి పరిశోధన విషయాలన్నీ వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ తెలంగాణ ఆదిహిందూ జాతికులాల సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డలపై ఉందన్నారు. గ్రామీణ ప్రాంత బిడ్డగా అరుదైన పరిశోధన జరిపిన చందును అభినందించారు. ఆయన వెంట రాళ్లబండి చందు, బొంగురం జితేందర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment