సిద్దిపేటరూరల్: జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు తీసుకుని మమ్మల్ని రోడ్డున పడేయొద్దని చిన్నగుండవెల్లి రైతులు అధికారులను వేడుకున్నారు. బుధవారం మండల పరిధిలోని చిన్నగుండవెల్లి గుండా నిర్మించనున్న జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధింయి ఎమ్మార్వో వెంకట్‌రెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు జాతీయ రహదారి కోసం అధికారులు చేస్తున్న సర్వే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న చిన్నగుండవెళ్లి గ్రామ భూములు విలువ ఎకరానికి రూ.కోటికి పైగా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారి మంజూరు చేసి రైతుల భూములు లాక్కుంటుందని వారు ఆరోపించారు. గ్రామం చుట్టూ ఇప్పటికే అండర్‌గ్రౌండ్ టన్నెల్, ఓపెన్ కాలువల పేరుతో సగం భూమిని కోల్పోయామని వారు వాపోయారు. మళ్లీ ఇప్పుడు ఉన్న భూమిని కూడా జాతీయ రహదారి పేరిట లాక్కుంటే తమ జీవితాలు రోడ్డున పడతాయన్నారు. అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గ్రామసభలు ద్వారా చర్చించకుండా వారికి నచ్చిన విధంగా సర్వే చేయడం సరికాదన్నారు. విలువైన భూముల్లో పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడు మా భూములు తీసుకుంటున్న క్రమంలో తమకు ఎకరానికి రెండు ఎకరాల చొప్పున భూములు అందించి ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
చిన్నగుండవెల్లి రైతులు వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment