
మహిళలకు ప్రత్యేక చట్టాలు
సంగారెడ్డి టౌన్ : సమాజంలో మహిళల పాత్ర గొప్పదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర పేర్కొన్నారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు నేడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. సమాజంలో లైంగిక దాడులు, హత్యాచారాలు, లైంగిక దోపిడీ, వరకట్నం వంటి సమస్యలు వెంటాడుతుంటాయని, వీటిని పరిష్కరించేందుకు మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహల నిర్మూలపై అవగాహన కల్పిస్తున్నాం. మహిళలకు ఎటువంటి న్యాయం కావాలన్నా కోర్టులో ఉచితంగా న్యాయం పొందవచ్చన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర
Comments
Please login to add a commentAdd a comment