
ఫోన్ మెసేజ్‌లతోనే ఎక్కువ ఇబ్బంది
బస్టాప్, కాలేజీ, ఆఫీసుల కంటే మొబైల్ మెసేజ్‌లతోనే మహిళల ఇక్కట్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నెట్‌వర్క్: మొబైల్ ఫోన్లలో వస్తున్న మెసేజ్‌లతో మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. బస్టాప్‌లు, కాలేజీలు, ఆఫీసుల్లో కంటే ఈ మొబైల్‌లలోని సందేశాలతోనే అధికంగా ఇక్కట్లకు గురవుతున్నట్లు తేలింది. బస్టాపులు, ఆఫీసుల్లో ఇబ్బందులు పడుతున్న వారు సుమారు 29 శాతం చొప్పున ఉంటే.. సెల్‌ఫోన్లతో వచ్చే మెసేజ్‌లతో 51 శాతం పరేషాన్ అవుతున్నట్లు మహిళలు అభిప్రాయ పడ్డారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలో ‘సాక్షి’ ప్రత్యేక సర్వే నిర్వహించింది. 140 మంది మహిళల అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించింది. ఇందులో వివిధ ఏజ్‌గ్రూపులకు చెందిన వారి అభిప్రాయలను తీసుకుంది. ఈ సర్వేలో తేలిన ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తే..
ఇంట్లో వివక్ష లేదు
ఇంట్లో తల్లిదండ్రులు గతంలో ఆడ–మగ వివక్ష చూపేవారు. కాలం మారుతున్న కొద్దీ ఈ వివక్ష తగ్గుతోంది. మగ పిల్లాడితో సమానంగా ఆడ పిల్లలను కూడా చదివిస్తున్నారు. సర్వేలో కూడా ఇదే అంశం తేలింది. 71 శాతం మంది మహిళలు ఇంట్లో వివక్షను ఎదుర్కొనడం లేదని తేల్చి చెప్పారు. కేవలం 12 శాతం మాత్రమే ఇంకా వివక్ష ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. మరో 17 శాతం మంది చెప్పలేమని సమాధానమిచ్చారు.
కళాశాల, పని ప్రదేశాల్లో స్వల్పంగా..
కళాశాలలో, పనిచేసే ప్రదేశాల్లో మహిళలు స్వల్ప వివక్ష ఎదుర్కొంటున్నారు. 28 శాతం మంది మహిళలు ఇప్పటికీ కళాశాల, పని ప్రదేశంలో వివక్ష ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు చోట్ల వివక్ష లేదని 52 శాతం మంది చెప్పారు. 20 శాతం మంది చెప్పలేమని సమాధానమిచ్చారు. మహిళలు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిలో తెలియని వారితో పాటు, తెలిసిన వారు కూడా దాదాపు సమానంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
మీ కళాశాల – పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా?
ఎ) ఉంది – 39 బి) లేదు – 73
సి) చెప్పలేను – 28
మీ ఇంట్లో ఆడ –మగ వివక్ష ఏమైనా ఉందా..
ఎ) ఉంది – 17
బి) లేదు – 99
సి) చెప్పలేను – 24
మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం
ఎ) బస్టాప్‌లో–41 బి) కాలేజీ లేదా
ఆఫీసులో – 41 సి) సెల్‌ఫోన్‌లో వచ్చే
మెసేజ్‌లతో –58
మిమ్మల్ని ఇబ్బంది
పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు
ఎ) తెలియని వారు–71 బి) తెలిసిన వారే–69
41%
58%
కాలేజీ, పనిప్రదేశంలో వివక్ష లేదన్న 52 శాతం వనితలు
ఉందన్నవారు కేవలం 28 శాతం మంది
ఇంట్లో ఆడ –మగ వివక్ష ఉందన్న వారు స్వల్పమే
‘సాక్షి’ సర్వేలో ఆసక్తికర అంశాలు
వివిధ ఏజ్‌గ్రూపుల్లో 140 మంది అభిప్రాయాల సేకరణ

ఫోన్ మెసేజ్‌లతోనే ఎక్కువ ఇబ్బంది

ఫోన్ మెసేజ్‌లతోనే ఎక్కువ ఇబ్బంది

ఫోన్ మెసేజ్‌లతోనే ఎక్కువ ఇబ్బంది
Comments
Please login to add a commentAdd a comment