బల్దియా బడ్జెట్ ఢమాల్
● గతేడాదితో పోల్చితే రూ.25 కోట్లు తగ్గుదల
● అంచనా బడ్జెట్ రూ.75.19 కోట్లు
● ఆదాయ, వ్యయ అంచనాల్లో స్వల్ప తేడా
● సిద్దిపేట మున్సిపాలిటీ బడ్జెట్‌కుఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదం
సిద్దిపేటజోన్: జిల్లాలోని ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేట పెద్ద పద్దు(బడ్జెట్)ను సోమవారం ప్రవేశపెట్టారు. గతేడాది బడ్జెట్ రూ.104 కోట్లతో పోల్చితే సారి రూ.25 కోట్ల ఆదాయ, వ్యయ అంచనాల్లో తగ్గుదల కనిపించింది. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సమక్షంలో 2025–26 అంచనా బడ్జెట్, 2024–25 సవరణ అంచనా బడ్జెట్‌లను కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025–26 అంచనా బడ్జెట్‌లో వివిధ రూపాల్లో మున్సిపాలిటీకి రూ. 75.19 కోట్ల ఆదాయం చూపించగా, వివిధ ఖర్చుల కింద రూ.75.14 కోట్ల అంచనాతో రూపకల్పన చేశారు. 2024–25 సవరణ బడ్జెట్ మిగులు నిల్వతో కలిపి 2025–26కు గాను రూ. 2 కోట్ల 12 లక్షల ముగింపు నిల్వగా బడ్జెట్ పొందుపరిచారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ బడ్జెట్ ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2025–26 ఆదాయ, వ్యయ బడ్జెట్ పరిశీలిస్తే కేవలం రూ.4లక్షల స్వల్ప తేడా కన్పించింది.
Comments
Please login to add a commentAdd a comment