జిల్లాతో అనుబంధం మర్చిపోలేనిది
ఎస్పీని పరేడ్ గ్రౌండ్‌కు తీసుకువస్తున్న పోలీసులు
సంగారెడ్డి జోన్: ఎస్పీగా నా మొదటి పోస్టింగ్ సంగారెడ్డి అని.. జిల్లాతో నాకున్న అనుబంధం ఎప్పటికీ మరచిపోలేనని ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో బదిలీ అయిన ఎస్పీ రూపేష్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో విధాయి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూపేష్ మాట్లాడుతూ.. జిల్లాలో మెరుగైన సేవలు అందించడంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాత్ర ఎంతగానో ఉందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పుష్పగుచ్ఛంతో అలంకరించిన పోలీసు వాహనంలో ఎస్పీ, వారి కుటుంబ సభ్యులను పరేడ్ గ్రౌండ్ నుంచి కార్యాలయ ఆవరణ వరకు తాడు సహాయంతో తీసుకువచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవరావ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ చెస్నూరి రూపేష్
Comments
Please login to add a commentAdd a comment