తమ పొలాలకు వెళ్లకుండా..
తమ భూముల్లో పంటలు పండించుకునేందుకు వెళ్లేందుకు వీలులేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డుగోడలు కట్టారని, దీంతో తాము వ్యవసాయం చేయడానికి వీలు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కంది మండలం చెర్లగూడెంకు చెందిన సుమారు 35 మంది రైతులు కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రం అందజేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూముల్లోకి వెళ్లనీయకుండా ఎక్కడికక్కడ పలకలతో గోడలు కట్టడంతో తమ పంటను ఇంటికి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని గోపాల్‌రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment