
బావిలో యువకుడి మృతదేహం లభ్యం
న్యాల్‌కల్(జహీరాబాద్): బావిలో స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందిన యువకుడి మృతదేహం లభ్యమైనట్లు హద్నూర్ ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. మండల పరిధిలోని వడ్డి గ్రామానికి చెందిన శివకుమార్ శుక్రవారం తోటి స్నేహితులతో కలిసి వ్యవసాయ బావి వద్దకు స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. బావిలో నీరు అధికంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం వరకు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం గాలింపు చేపట్టగా మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.