దివ్యాంగులకు
సదరం సర్టిఫికెట్ స్థానంలో యూడీఐడీ కార్డులు
జిల్లాలో పెన్షనర్ల వివరాలు
దివ్యాంగులు – 13,793
వృద్ధులు – 59,242
వితంతువులు – 55,060
గీత కార్మికులు – 2,942
చేనేత – 2,206
హెచ్‌ఐవీ –1,034
ఫైలేరియా – 2,441
డయాలసిస్ – 103
ఒంటరి మహిళలు – 3,417
బీడీ కార్మికులు – 45,473
బీడీ టైకేదార్లు – 2,078
మొత్తం పెన్షనర్లు – 1,86,000
ప్రస్తుతం సదరం సర్టిఫికెట్లు ఏడు కేటగిరీల్లో మాత్రమే అందించడం జరిగింది. మరో 14 కేటగిరీలను కలుపుకొని మార్చి నెల నుంచి యూనిక్ డిసెబిలిటీ గుర్తింపు కార్డులు 21 కేటగిరీల వారీగా అందించనున్నారు. యూడీఐడీ కార్డు కోసం ఎప్పటి మాదిరిగానే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించే క్యాంపునకు హాజరు కావాలి. గతంలో మాదిరిగానే మీసేవా కేంద్రంలో గాని, ఫోన్‌లో గాని స్లాట్ బుక్ చేసుకొని క్యాంపునకు వెళ్లాలి. అనంతరం నిపుణులైన వైద్యులు పరీక్షల అనంతరం ఆన్‌లైన్‌లో దివ్యాంగుల వివరాలు నమోదు చేస్తారు. దరఖాస్తు వివరాలు, వైకల్యశాతం, వైద్యుల లాగిన్‌కు చేరుతుంది. అక్కడ వివరాలు పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారి సంతకంతో కూడిన కార్డు మంజూరవుతుంది.
3 రంగుల్లో కార్డులు..
ప్రభుత్వం ప్రతీ శనివారం ఏర్పాటు చేయనున్న సదరం క్యాంపుల్లో వైకల్యం సంబంధించి వైద్యులు పరీక్షిస్తారు. అనంతరం పరీక్షల వివరాలు, లోపాలను ఆన్‌లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు, లోపాలను బట్టి వైకల్య శాతం జనరేట్ అవుతుంది. ఈ శాతాన్ని మార్చడానికి వైద్యులకు ఎలాంటి అవకాశం ఉండదు. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ రూపొందించడం ద్వారా ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఈ శాతాన్ని అనుసరించి యూ డీఐడీ కార్డులు మూడు రంగుల్లో ఇవ్వనున్నారు.
ఇప్పటికే ఉన్న ధ్రువపత్రం ఉపయోగం
సదరం క్యాంపులో భాగంగా వైక్యలం గుర్తించబడి శాశ్వతంగా పెన్షన్ మంజూరీకి ధ్రువపత్రాన్ని పొందిన వారు కూడా ఈ పోర్టల్ దరఖాస్తు చేసుకొని పర్మినెంట్ యూడీఐడీ కార్డును పొందేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ధ్రువపత్రం అన్ని రకాలుగా వినియోగించుకునేందుకు వీలుంది.
పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దివ్యాంగులు యూడీఐడీ పోర్టల్ www. swavlambancard.gov.inలో సంబంధిత వివరాలతో ఆన్‌లైన్‌లో గాని, మొబైల్ ఫోన్‌లో గాని దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్ ప్రకారం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు పరీక్షలు నిర్వహించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో ఆటోమెటిక్‌గా వైకల్య శాతం జనరేట్ చేసి గుర్తింపు కార్డులు అందించడం జరుగుతుంది. చిరునామా వివరాలు నమోదు చేయడం ద్వారా ఇంటికే స్పీడ్ పోస్టు ద్వారా యూడీఐడీ కార్డు పంపించడం జరుగుతుంది. ప్రతీ వ్యవహారానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడూ ఫోన్‌కు సమాచారం అందించడం జరుగుతుంది. ఒక్కసారి కార్డు మంజూరైతే శాశ్వతంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఈ కార్డు పని చేస్తుందని, రైళ్లు, బస్సుల్లో సైతం ప్రాధాన్యంతోపాటుగా పలు రకాల సౌకర్యాలను కూడా పొందవచ్చు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అర్హులైన దివ్యాంగులను వైకల్య శాతాన్ని బట్టి ఇప్పటివరకు జారీ చేస్తున్న సదరం ధ్రువపత్రాలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. వీటి స్థానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అంగవైకల్య యూడీఐడీ (యూనిక్ డిసెబుల్ ఐడెంటిటీ కార్డు) ను జారీ చేయనుంది. ఈ కార్డులను ఈ నెల నుంచి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
దివ్యాంగులు యూడీఐడీ పోర్టల్‌లో దరఖాస్తు చేస్తున్న వివరాలతోపాటుగా వైద్యులువైకల్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో ఎలాంటి తప్పులు జరిగేందుకు వీలు లేకుండా ఉంటుంది. 21 రకాల వైకల్యం కలిగి ఉన్న అర్హులైన దివ్యాంగులకు ఈ కార్డులను అందించనున్నారు. ఒకే దేశం ఒకే కార్డు విధానంలో ఈ కార్డు దేశం అంతటా పనిచేసేందుకు వీలు ఉండనుంది. – సిద్దిపేటరూరల్
3 రంగుల్లో అందించనున్న ప్రభుత్వం
21 రకాల వైకల్యం కలిగిన దివ్యాంగులు అర్హులు
ఈ నెల నుంచి అమల్లోకి..
పోర్టల్ ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం
జిల్లా వ్యాప్తంగా 1,86,000 మంది
ప్రత్యేక గుర్తింపు
ప్రత్యేక గుర్తింపు
ప్రత్యేక గుర్తింపు