పాపన్నపేట(మెదక్): మంజీరా జలాలు కుళ్లిన కోళ్ల మృతదేహాలతో కలుషితమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జి కింది నుంచి ప్రవహించే మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తులు భారీ సంఖ్యలో మృతి చెందిన కోళ్లను పడేశారు. అవి కాస్త కుళ్లిపోయి జలాలు కలుషితమవుతున్నాయి. ఇటీవలె విస్తరిస్తున్న బర్డ్‌ఫ్లూ వ్యాధి వల్లే కోళ్లు చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు. ఈ నీటిని దిగువన మెదక్ పట్టణానికి తాగునీరుగా సరఫరా చేస్తారు. ఇలా కలుషితం చేస్తే ప్రజలు రోగాల బారిన పడుతారని ఆందోళన వ్యక్తమవుతోంది.