జహీరాబాద్ టౌన్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీమంత్రి హరీశ్‌రావుపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఎమ్మె ల్యే మాణిక్‌రావు, జహీరాబాద్ నాయకులు ఆయనను కలిశారు.హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డితో కలసి హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట జహీరాబాద్, మొగుడంపల్లి,కోహీర్, ఝరాసంగం మండలాల అధ్యక్షులు తట్టునారాయణ, సంజీవ్‌రెడ్డి, నర్సింలు, వెంకటేశం, నాయకులు మిథిన్‌రాజ్ తదితరులున్నారు.
సమస్యల పరిష్కారానికి
కృషి చేస్తా : ఎమ్మెల్యే గూడెం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్‌లలో నివాసం ఉండే పేదల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హామీనిచ్చారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్‌నగర్‌లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు మరింత మెరుగైన ేవైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ వైద్యులు, వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని వివరించారు. ఇక్కడి ప్రజలకు త్వరలో మరింత మెరుగైన సదుపాయాలను కల్పిస్తామని అందుకు తగిన నిధులను కూడా కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గాయిత్రీదేవి, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి పాల్గొన్నారు.
హరీశ్‌ను కలిసిన ఎమ్మెల్యే మాణిక్‌రావు