
అమీన్పూర్ ఎకై ్సజ్ పీఎస్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే గూడ
పటాన్ చెరు: అమీన్పూర్ కేంద్రంగా నూతన ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ మంజూరైందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కోసం..మంగళవారం ఉదయం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో గల పాత గ్రామ పంచాయతీ భవనాన్ని వివిధ శాఖల అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏప్రిల్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో అమీన్‌పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి పాల్గొన్నారు.
సామాజిక ఆస్పత్రి పరిశీలన
నారాయణఖేడ్: నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తిలోని 30 పడకల సామాజిక ఆస్పత్రిని సికింద్రాబాద్ ఏరియా ఆస్పత్రికి చెందిన కాయకల్ప బృందం మంగళవారం సందర్శించింది. సూపరింటెండెంట్ అనురాధ నేతృత్వంలో నర్సింగ్ ఆఫీసర్ అమూల్యరాణి, డాక్టర్ రాధాకృష్ణ, ప్రవీణ్‌ల బృందం ఆస్పత్రి పరిశుభ్రత, ఇన్‌పేషెంట్లతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. వారి వెంట డాక్టర్ స్వప్న, డా.జువేరియాబేగం, సూపర్‌వైజర్ గురుస్వామి ఉన్నారు.

అమీన్పూర్ ఎకై ్సజ్ పీఎస్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే గూడ