చేర్యాల(సిద్దిపేట): వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ అని, పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పార్టీ శతవసంత వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణ కేంద్రంలోని గాంధీ చౌరస్తా నుంచి అంగడిబజార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం షాదీ ఖానాలో జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాల ఆశయాల సాధనకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు చేసిందన్నారు. 100 ఏళ్ల పోరాటాలు, త్యాగాలు వంటి గొప్ప చరిత్ర కలిగిన ఏకై క పార్టీ సీపీఐ అన్నారు. అనంతరం రాష్ట్ర నాయకులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, జనగా మ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, నాయకులు దయానందరెడ్డి, సత్యనారాయణ, వనేష్, లక్ష్మణ్, శంకర్, జనా ర్దన్, భూమయ్య, బాలుమోహన్, పద్మ, నరేశ్, రజిని, మమత, మహేందర్, కృష్ణ, భాస్కర్‌రెడ్డి, సుదర్శన్, ప్రేమ్, బాల్‌రెడ్డి, భాస్కర్, బన్సిలాల్, సత్త య్య, నర్సింహచారి, అశోక్, కనకయ్య, శ్రీకాంత్, సురేందర్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ కార్యవర్గ సభ్యుడు,
మాజీ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి
చేర్యాలలో శతవసంత ర్యాలీ,
బహిరంగ సభ