అసెంబ్లీలో ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్: నియోజకవర్గంలో గతంలో ఏర్పడిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని గురువారం ఎమ్మెల్యే మాణిక్‌రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. 2011లో నిమ్జ్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారన్నారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి పనులు కూడా ముందుకు సాగడం లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఉపాధి లభించనుందన్నారు.
భారతినగర్ డివిజన్‌లో జోనల్ కమిషనర్ పర్యటన
రామచంద్రాపురం(పటాన్‌చెరు): భారతినగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి గురువారం పర్యటించారు. బొంబాయి కాలనీ లోని రైతు బజారు నిర్మాణ పనులను పరిశీలించారు. పార్కింగ్ వాల్‌కు గ్రిల్స్ ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మాక్స్ సొసైటీ కాలనీకి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వేసిన చెత్తను పరిశీలించారు.