సిద్దిపేటరూరల్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిద్దిపేట డివిజన్‌కు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారులు 13, 14, 15 తేదీలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. గజ్వేల్ డివిజన్ పరిధిలోని పీఓలు 13, 14 తేదీలలో గజ్వేల్ ఐఓసీలో, హుస్నాబాద్ డివిజన్ పీఓలు 13, 14 తేదీలలో ఐఓసీలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment