
బాధ్యతాయుతంగా పనిచేయండి
● మున్సిపల్ కమిషనర్ ఆశ్రీత్ కుమార్ ● వార్డు ప్రత్యేక అధికారులతో సమావేశం
సిద్దిపేటజోన్: వార్డు ప్రత్యేక అధికారులుగా బాధ్యతాయుతంగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రీత్ కుమార్ సూచించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేయాలని, సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నీటి సరఫరా, విద్యుత్ దీపాల సమస్యలు ఉంటే సంబంధించిన సిబ్బందికి తెలుపాలని సూచించారు. వార్డుల్లో నూతన ఇంటి నిర్మాణాలు నిబంధనల మేరకు ఉండేలా చూడాలని, నిబంధనలు ఉల్లంగిస్తే టౌన్ ప్లానింగ్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు తాగునీరు పొదుపుగా వాడేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆస్తి, నల్లా పన్నులు వసూలు వంద శాతం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారి శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment