
కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.12.80లక్షలు
జగదేవ్‌పూర్(గజ్వేల్): కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.12,80,943 వచ్చినట్లు దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి, ఈఓ రవికుమార్ తెలిపారు. 74 రోజుల అమ్మవారి హుండీలోని కానుకలను లెక్కించినట్లు తెలిపారు. వచ్చిన ఆదాయంతో ఆలయాభివృద్ధికి ఖర్చు చేస్తామని అన్నారు. అలాగే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.
‘ఉగాది బాలల’పోటీకి 372 కథలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సుగుణ సాహితి సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది బాలల పోటీలకు 372 కథలు వచ్చాయని సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య బుధవారం తెలిపారు. ప్రతి ఏటా ఉగాది పండుగ పురస్కరించుకుని బాలల కథల పోటీలను నిర్వహిస్తున్నామని దుర్గయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 29 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 372 కథలు రావడం సంతోషంగా ఉందన్నారు. మార్చి నెల చివరి నాటికి విజేతలను ప్రకటించనున్నట్లు తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో
మహిళలకు ప్రాధాన్యం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పాలనలోనే మహిళలకు సాముచిత స్థానం దక్కుతుందని పార్టీ నాయకులు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో పట్టణ మహిళా అధ్యక్షురాలిగా మార్క పద్మకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా రాణించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను గడపగడపకూ వివరించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు హరికృష్ణ, అత్తు ఇమామ్, ముద్దం లక్ష్మి, పయ్యావుల ఎల్లం యాదవ్, వహాబ్ తదితరులు పాల్గొన్నారు.
జాబ్‌మేళాలో
48 మంది ఎంపిక
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 48 మంది అభ్యర్థులు ఎంపికై నట్లు కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. స్థానిక కళాశాలలో ఆయన మాట్లాడుతూ మేళాకు చక్కని స్పందన వచ్చిందన్నారు. మొత్తం 176 మంది అభ్యర్థులు హాజరుకాగా వివిధ బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల్లో మొత్తం 48 మంది పలు ఉద్యోగాలకు ఎంపికై నట్లు చెప్పారు. హెచ్‌డీఎఫ్‌సీలో 18, యాక్సిస్ బ్యాంకుకు 25 మంది, యూనిమోనిలో ఐదుగురు అభ్యర్థులు ఎంపికై నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ ఉమామహేశ్వరీ, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ గోపాలసుదర్శనం, డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు.
అందుబాటులోకి
అకాడమీ సేవలు
తొలి బ్యాచ్‌కు 31మంది ఎంపిక
మొదటిరోజు 12మంది చేరిక
సిద్దిపేటజోన్: జిల్లాకు మంజూరైన వాలీబాల్ అకాడమీ సేవలు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో సంబంధిత శాఖ ప్రచారార్భాటాలు లేకుండా బుధవారం అకాడమీ సేవలను ప్రారంభించారు. అకాడమీలో శిక్షణ తరగతులకోసం ఇద్దరు కోచ్‌లను, వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాలీబాల్ అకాడమీకి 20మంది బాలికలు, 20బాలురుకు వసతి, శిక్షణ అనుమతి లభించింది. గతేడాది అకాడమీలో ప్రవేశాల కోసం 31 మందిని ఎంపిక చేశారు. తొలి బ్యాచ్‌కు 31మంది క్రీడాకారులలో మొదటిరోజు 10మంది బాలురు, ఇద్దరు బాలికలు జాయిన్ అయ్యారు.
పరామర్శ
మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో వివిధ కారణాలతో ఒకే రోజు మృతి చెందిన బాధిత కుటుంబాలను బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డి పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరామర్శించారు. ఆయన వెంట పార్టీ జిల్లా నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment