Tamil Nadu Table Tennis Player Passed Away: తమిళనాడుకు చెందిన యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీనదయాళన్ (18) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. విశ్వ మరో ఐదుగురు కలిసి 83వ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు గౌహతి నుండి షిల్లాంగ్‌కు వెళ్తుండగా (టాక్సీలో) ఈ ఘోరం సంభవించింది. ఈ ప్రమాదంలో విశ్వతో పాటు కారు డ్రైవర్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదలగా, మిగతా ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
Saddened to learn that Tamil Nadu paddler, Deenadayalan Vishwa passed away after an accident in Ri Bhoi District while on his way to Shillong to participate in the 83rd Senior National Table Tennis Championship in our State@ianuragthakur @KirenRijiju @mkstalin @CMOTamilnadu pic.twitter.com/sGvAc3eDhe
— Conrad Sangma (@SangmaConrad) April 17, 2022
ఈ విషయాన్ని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. విశ్వ అకాల మరణం పట్ల మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా సంతాపం వ్యక్తం చేశారు. షిల్లాంగ్ వేదికగా జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ ఇవాల్టి (ఏప్రిల్ 18) నుంచి ప్రారంభమైంది. కాగా, విశ్వ.. అండర్-19 అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున అనేక పతకాలు సాధించాడు. ఈనెల 27 నుంచి ఆస్ట్రియాలోని లింజ్‌లో జరిగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో అతను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండింది.
చదవండి: VVS Laxman: క్రీడలపై మక్కువతోనే క్రికెటర్‌నయ్యా..
Comments
Please login to add a commentAdd a comment