ఐపీఎల్-2023 సీజన్ ముగిసిన అనంతరం టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. జూన్ 7 నుంచి లండన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేకు బంఫరాఫర్ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో అజింక్యా రహానే జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.
అద్భుత ఫామ్‌లో రహానే..
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రహానే దుమ్మురేపుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 61 పరుగులతో అదరగొట్టిన రహానే.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా 31 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలోనే రహానే మళ్లీ జాతీయ జట్టులోకి పిలుపునివ్వాలని భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే తొలుత అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ సూర్యకుమార్ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా సెలక్టర్లు తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో విదేశీ పిచ్‌లపై అనుభవం ఉన్న రహానే వైపు మెగ్గు చూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
రంజీల్లో దుమ్మురేపిన రహానే..
అదే విధంగా రంజీ సీజన్ 2022-23లో రహానే అదరగొట్టాడు. 7 మ్యాచ్‌లు ఆడిన రహానే 57.63 సగటుతో 634 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, డబుల్ సెంచరీ ఉన్నాయి. ఇక రహానే చివరగా భారత్ తరుపున గతేడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాపై ఆడాడు.
చదవండి: IPL 2023: పవర్ హిట్టర్ వచ్చేశాడు! అందరి కళ్లు అతడిపైనే! మామూలుగా ఉండదు!
Comments
Please login to add a commentAdd a comment