
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 374 పరుగులు చేయగా, భారత్ 308 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. అయితే నిన్నటి మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్, అరోన్ ఫించ్ సెంచరీలతో పాటు వార్నర్ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, మ్యాక్స్‌వెల్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45 పరుగులు సాధించాడు.అయితే మ్యాక్స్‌వెల్ తాజా ప్రదర్శనపై విమర్శల వర్షం కురిసింది. కనీసం ఇలా ఐపీఎల్ ఒక్క మ్యాచ్‌లో ఆడుంటే కింగ్స్ పంజాబ్ పరిస్థితి వేరుగా ఉండేదని అభిమానులు విమర్శించారు. ఇక న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ కూడా ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ జరిగిన తొలి టీ20లో 24 బంతుల్లో 48 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లే.(వరల్డ్‌కప్ భారత్‌లోనే కదా.. ఇక పూర్ ఓవర్‌రేట్ ఏంటి?)
దీనిపై ఒక అభిమాని సెటైర్ వేశాడు. ‘మీ దేశాలకు ఆడేటప్పుడు ఎంతటి విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారో కేఎల్ రాహుల్ చూశాడు’ అంటూ సరదాగా పోస్ట్ చేశాడు. అవును.. నిజంగానే మంచి ఇన్నింగ్స్‌లు ఆడాం’ అంటూ నీషమ్ బదులిచ్చాడు. అదే సమయంలో మ్యాక్సీ కూడా రిప్లై ఇస్తూ తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే కేఎల్ రాహుల్‌కు క్షమాపణలు చెప్పాను’ అని పేర్కొన్నాడు. (‘టీమిండియా ఏదీ గెలవదు’)
ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యంత దారుణంగా విఫలమైన బ్యాట్స్‌మెన్‌లలో కింగ్స్ పంజాబ్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ ఒకడు. గతంలో ఎప్పుడూ చూడని మ్యాక్స్‌వెల్‌ను ప్రస్తుత ఐపీఎల్ చూస్తున్నామనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడూ తన విధ్వంసకర ఆట తీరుతో ప్రత్యర్థులకు దడ పుట్టించే మ్యాక్స్‌వెల్ ఈ సీజన్ ఐపీఎల్‌లో పూర్తిగా తేలిపోయాడు. ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ 13 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 108 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 106 బంతులు మాత్రమే ఆడాడు. ఈ ఐపీఎల్‌లో మ్యాక్సీ ఖాతాలో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం.
I apologised to him while I was batting 😂 🦁 🙏 #kxipfriends ❤️
— Glenn Maxwell (@Gmaxi_32) November 28, 2020