
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. శనివారం జరిగిన పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో రజత్ చౌహాన్, అమన్ సైనీ, అభిషేక్ వర్మలతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. జీన్ ఫిలిప్, బేరర్, అడ్రియన్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో భారత్ 232–231తో విజయం సాధించింది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్‌లో అభిషేక్–ముస్కాన్ ద్వయం 156–157తో అమందా–బుడెన్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది.