Asia Cup 2022- India Vs Pakistan: క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదరుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఆసియాకప్-2022లో భాగంగా ఆదివారం(ఆగస్టు 28)న దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. కాగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌ను పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఎంచుకున్నాడు.
అతడు కోహ్లి, రోహిత్, రాహుల్ కాదని సూర్యకుమార్ యాదవ్ వైపు అక్రమ్ మొగ్గు చూపాడు. ఆసియాకప్‌లో పాకిస్తాన్‌కు చక్కలు చూపించే సత్తా సూర్యకుమార్‌కు ఉందని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
పాక్‌కు చుక్కలు చూపించే సత్తా అతడికే ఉంది!
"భారత జట్టులో కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు ఆనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో నాకు అత్యంత ఇష్టమైన ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సూర్యని తొలిసారిగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడినప్పుడు చూశాను.
అతడు ఆ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో ఏడు, ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్ వచ్చాడు. అతడు ఆ మ్యాచ్‌ల్లో అంతగా రాణించికపోనప్పటికీ.. అతడు ఆడిన షాట్లు అసాధారణమైనవి. ఫైన్ లెగ్ దిశగా సూర్యలా షాట్‌లు ఆడడం చాలా కష్టం అని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం అక్రమ్ పేర్కొన్నాడు.
అద్భుతమైన ఫామ్‌లో సూర్య
కాగా సూర్యకుమార్ యాదవ్ ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌తో పాటు విండీస్‌తో టీ20 సిరీస్‌లో కూడా దుమ్మురేపాడు. ఇప్పటి వరకు 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 672 పరుగులు సాధించాడు. అతడి టీ20 కెరీర్‌లో ఒక సెంచరీ కూడా ఉంది. ఈ ఏడాది జూలై ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్య తన సెంచరీని సాధించాడు.
ఇక ఆసియాకప్-2022కు విషయానికి వస్తే.. ఈ మెగా టోర్నీ యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్- శ్రీలంక తలపడనున్నాయి. ఇక ఈ టోర్నీలో మెత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఇప్పటికే భారత్,పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. ఇక మరో స్థానం కోసం క్వాలిఫియంగ్ రౌండ్‌లో యూఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ తలపడనున్నాయి. కాగా 2016 తర్వాత తొలి సారి ఆసియాకప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.
చదవండి: Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ! ద్రవిడ్ దూరం?!
Comments
Please login to add a commentAdd a comment