వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆసీస్ ఓటమి పాలైంది. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైన కంగారూ జట్టు.. ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది.
312 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. రబడ (3/33) ఆసీస్‌ను చావుదెబ్బ తీయగా, జాన్సెన్, కేశవ్, షమ్సీ తలా 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్(109) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆసీస్ ఓటమి పాలైంది. ఈ మెగా టోర్నీలో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన ఆసీస్.. అంతకుముందు 2019 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా చేతుల్లో వరుసగా ఓటమిపాలైంది.
చదవండి: SMT 2023: తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్
Comments
Please login to add a commentAdd a comment